Site icon NTV Telugu

Man Kills Mother: భోజనం పెట్టలేదని తల్లిని చంపి చెట్టుకు ఉరేసిన దుర్మార్గుడు..

Man Kills Mother

Man Kills Mother

Man Kills Mother: మధ్యప్రదేశ్‌లో దారుణం జరగింది. కనిపెంచిన తల్లిని అత్యంత కిరాతకంగా హతమర్చాడు కన్నకొడుకు. తనకు రాత్రి భోజనం పెట్టలేదనే కోపంతో రాష్ట్రంలోని రత్నా జిల్లాలో కసాయ కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని కొట్టి చంపి చెట్టుకు ఉరేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న శరవణ్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Read Also: Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..

కొడుకు ఆశారాం, తన తల్లి జీవాబాయి(65)ని అర్థరాత్రి హత్య చేసినట్లు బాధితురాలి భర్త మాలియా భీల్ శరవణ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ నీలం చోఘడ్ విలేకరులకు తెలిపారు. రాత్రి భోజనం వడ్డించే విషయంలో తల్లితో కొడుకు ఆశారం గొడవపడినట్లు తేలిందని తెలిపారు. తండ్రి జోక్యం చేసుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సమయం తర్వాత మళ్లీ వచ్చి కర్రలతో కొట్టి, ఇటుకతో మోది తల్లిని హత్య చేశాడు. ఆ సమయంలో తండ్రి నిద్రిస్తున్నట్లు అధికారి తెలిపారు.

ఆ తర్వాత ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు తల్లి మృతదేహాన్ని వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందనే కుట్రను ముందుకు తెచ్చాడు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, నిందితుడి కోసం గాలింపు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Exit mobile version