UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
- యూపీ హర్దోయ్‌లో దారుణం
- మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఏదొక చోట మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా యూపీలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 22 ఏళ్ల మేనకోడలను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హర్దోయ్‌లో జరిగింది.
వరుసకు మేనకోడలైన 22 ఏళ్ల మాన్సీ పాండే అనే యువతితో రెండేళ్ల నుంచి మణికాంత్ ద్వివేది అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ మధ్య ఆమె మరొకరిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. దీంతో మణికాంత్.. ఆమెపై పగ పెట్టుకున్నాడు. అంతే అదునుచూసి ఆమెను అంతమొందించాడు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనంలో మృతదేహాన్ని పడేశాడు. పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు ఆమె సెల్‌ఫోన్‌ను బస్సులో విసిరేశాడు.
Also Read
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Haryana : జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
- Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మాన్సీ పాండే కనిపించడం లేదని ఆమె తండ్రి రాంసాగర్ పాండేకు మణికాంత్ ఫోన్ చేసి చెప్పాడు. అయితే రాంసాగర్‌కు మణికాంత్‌పై అనుమానం కలిగింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్షాబంధన్ రోజున అనగా.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికాంత్ ఇంటి దగ్గర మాన్సీని దింపినట్లు బాధితురాలి తండ్రి రాంసాగర్ పాండే తెలిపాడు. ‘‘మేము మా స్వగ్రామానికి వెళ్ళాము. తరువాత నేను లక్నో వెళ్ళాను. బుధవారం అతను (మణికాంత్) నాకు ఫోన్ చేసి.. మాన్సీ కనిపించడంలేదని మరియు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పాడు. మాన్సీ పారిపోయిందని అతను నాకు చెప్పాడు, కానీ నేను అతనిని అనుమానించి..పోలీసులకు ఫిర్యాదు చేశాను.’’ అని రాంసాగర్ తెలిపాడు.
పోలీసులు కేసు నమోదు చేసి మణికాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో నిందితుడు మణికాంత్ నేరాన్ని అంగీకరించాడు. మాన్సీతో తనకు రెండేళ్ల నుంచి సంబంధం ఉందని.. అయితే తాను వేరొకరని పెళ్లి చేసుకోబోతుందని చెప్పిందన్నాడు. ఆ కోపంతో ఆమెను చంపేసినట్లు తెలిపాడు. మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పడేసి.. ఫోన్‌ను బస్సులో పడేసినట్లు తెలిపాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
-
Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!