ఆలుమగలు అన్నాక చిన్న చిన్న గొడవలు.. కోపాలు.. తాపాలు ఉండడం సహజమే. కొద్దిసేపటి తర్వాత మరిచిపోయి మళ్లీ కలిసి పోతుంటారు. ఇలా దంపతుల మధ్య జరుగుతూనే ఉంటాయి. యూపీలో ఓ జంట మాత్రం పెళ్లికి వెళ్లే విషయంలో తగాదా పడి.. ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Rukshar Dhillon : గుబులు పుట్టిస్తున్న రుక్సర్ థిల్లాన్ స్టన్నింగ్ ఫోజులు..
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా కాకరాల గ్రామానికి చెందిన రోహిత్ (26), పార్వతి (24) భార్యాభర్తలు. గురువారం సాయంత్రం బంధువుల పెళ్లికి వెళ్లాల్సి ఉండడంతో భర్తను సిద్ధం కావాలని భార్య కోరింది. అయితే భార్య మాట లెక్క చేయకుండా బయటకు వెళ్లి ఫుల్‌గా మద్యం తాగి వచ్చాడు. దీంతో భర్త తీరుతో మనస్తాపం చెందిన పార్వతి.. ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక భార్య చనిపోయిందన్న వార్త తెలుసుకున్న రోహిత్.. మీర్జాపూర్ బేలా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025 : మహా కుంభమేళాలో ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు.. సరికొత్త రికార్డు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి వెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని.. భర్త నిర్లక్ష్యంతో భార్య ఆత్మహత్య చేసుకుందని.. భార్య చనిపోయిందన్న వార్త తెలిసి భర్త కూడా ప్రాణాలు తీసుకున్నాడని శుక్రవారం పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని.. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Pradeep Ranganathan: హీరోగా నన్ను చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు..