NTV Telugu Site icon

Uttar Pradesh: అపాచీ బైక్, 3 లక్షలు ఇవ్వలేదని భర్త దారుణం..

Up News

Up News

Uttar Pradesh: వరకట్న దాహానికి ఓ అమ్మాయి బలైంది. కట్నం ఇవ్వలేదని భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగింది. కట్నంగా ఇస్తామని చెప్పిన టీవీఎస్ అపాచీ బైక్, రూ. 3 లక్షల నగదు ఇవ్వకపోవడంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. బాధిత యువతిని ఆమె తల్లిగారి ఇంటి నుంచి తీసుకువచ్చిన భర్త, ఆమెను తీవ్రంగా కొట్టి చంపాడు.

ఈ ఘటన అమ్రోహా జిల్లాలోని బైఖేడా గ్రామానికి చెందిన సుందర్‌కి మీనా అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి కట్నం కోసం వేధించేవాడదు. దీంతో బాధిత యువతి తన తండ్రికి వేధింపుల గురించి చెప్పింది. రక్షాబంధన్ నుంచి మీనా సోహర్కాలోని తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. సుందర్ ప్రతీ రోజూ ఆమెను చూసేందుకు వచ్చే వాడు. అతను తన అత్తామామల ఇంట్లో భోజనం కూడా చేసే వాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆదివారం రాత్రి కూడా తన అత్తామామల్ని కలిసి, భార్యను ఇంటికి తీసుకువచ్చాడు.

Read Also: Bandi Sanjay: హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకు..?

ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వరకట్నం విషయమై మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కట్నం ఇవ్వకపోవడంతో ఆమెపై కర్రతో దాడి చేసి గొంతుకోసి హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. మహిళ కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు.యువతి తండ్రి విజయ్ ఖడక్ బన్షీ ఆమె భర్త, అతడి తల్లి, సోదరి, మరో నలుగురిపై ఫిర్యాదు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Show comments