NTV Telugu Site icon

Crime: వంట మనిషి ఆర్మీ జవాన్‌గా నటిస్తూ.. మహిళతో స్నేహం, అత్యాచారం..

Crime

Crime

Crime: ఆర్మీ జవాన్‌గా నటించిన ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడు. ఫేస్‌బుక్‌లో యువతితో స్నేహాన్ని పెంచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కపిలేష్ శర్మ 2023లో ఫేస్‌బుక్‌లో ఆర్మీ జవాన్‌గా కలరింగ్ ఇచ్చి, మహిళతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్‌ పెట్టుకున్నారు.

Read Also: Priyanka gandhi: ఈనెల 23న వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్.. హాజరుకానున్న రాహుల్, రాబర్ట్ వాద్రా

అయితే, నిందితడు ఆర్మీ జవాన్ కాదని, ఓ ప్రైవేట్ హస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడని గుర్తించిన మహిళ అతడితో రిలేషన్ నుంచి బయటకు వచ్చింది. అయితే, నిందితులు సదరు మహిళపై పలుమార్లు అత్యాచారం చేస్తూ, ఆమె ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీశాడు. వీటిని చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై ఐపీసీ సెక్షన్ 376 సహా పలు చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ ఒక్క కేసే కాదు, ఇంతకుముందు పలువురు ఇలాగే మాయమాటలు చెప్పి మహిళల్ని మోసం చేశారు. ఆర్మీలో పనిచేస్తున్నానని చెప్పి, పెళ్లిపేరుతో మహిళా కానిస్టేబుల్‌పై నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ కేసులో 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహిళ తన ఫిర్యాదులో తనకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా నిందితుడితో పరిచయం ఏర్పడిందని, అతను ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నట్లు నటించాడని పేర్కొంది.

Show comments