NTV Telugu Site icon

Vizag Crime: విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి.. వెలుగులోకి సంచలన విషయాలు..

Vizag

Vizag

Vizag Crime: విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది.. పెదగంట్యాడ లో యువతిపై జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నీరజ్‌ శర్మ రాడ్‌తో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు యత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు.. అయితే, బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. ఇక, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు… తలపై సుమారు 30 కుట్లు పడ్డాయి.. ప్రేమోన్మాది దాడి కేసులో బాధితురాలు తండ్రి కీలక విషయాలు బయటపెట్టారు.

Read Also: Lawrence Bishnoi: లారెన్ బిష్ణోయ్ హిట్‌ లిస్టులో ‘‘శ్రద్ధావాకర్’’ నిందితుడు అఫ్తాబ్..

కాశ్మీర్ కి చెందిన యువకుడి నీరజ్ తో విశాఖ గాజువాక కు చెందిన మేఘనకు కొన్ని ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.. రాజస్థాన్ లో ఓ దైవ కార్యక్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా దారితీసింది.. తర్వాత అతని ప్రవర్తన నచ్చక ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది.. దీంతో మేఘన మీద పగ పెంచుకున్న నీరజ్.. ఆమెను మానసికంగా హింసించసాగాడు.. ఆమె ఫొటోలను న్యూడ్ ఫొటోలకు జతచేసి సోషల్ మీడియాలో మేఘన బంధువులకు పంపించేవాడు.. దీనిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది.. న్యూ పోర్ట్ పోలీసులకు నీరజ్ తో తమ కూతురుకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు మేఘన తండ్రి పాపారావు.. ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో హెల్మెట్ పెట్టుకుని వచ్చి కూతురు తలపై ఒక రాడ్డుతో బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.. అడ్డొచ్చిన మరో ఇద్దరిపై కూడా అటాక్ చేసి పరారయ్యాడు.. నీరజ్ వల్ల తమకు కూడా ప్రాణహాని ఉందని పోలీసులు నిందితుని పట్టుకుని కఠినంగా శిక్షించాలి డిమాండ్‌ చేశారు మేఘన తండ్రి పాపారావు.

Show comments