NTV Telugu Site icon

Pune: వీడేం మనిషి.. కుక్కపై అత్యాచారం..

Pune

Pune

Pune: పూణేలోని హండేవాడి ప్రాంతంలో ఆడ కుక్కపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌కి చెందిన అలీముద్దీన్ అమినల్ షేక్‌గా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన మార్చి 26న జరిగింది. ఈ విషయానికి సంబంధించి కుక్క యజమాని చంద్రశేఖర్ యాదవ్ కలేపడల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా షేక్‌ని అరెస్ట్ చేశారు.

Read Also: SRH vs PBKS: దంచి కొట్టిన పంజాబ్ బ్యాటర్స్.. ఎస్‌ఆర్‌హెచ్ ముందు భారీ లక్ష్యం..

మార్చి 24న చంద్రశేఖర్ యాదవ్ మధుబని జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లాడు. ఐదేళ్ల ఆడ లాబ్రడార్ పార్కింగ్ ప్రాంతంలో ఉంచి, దానిని జాగ్రత్తగా చూసుకోవాలని పొరుగువారిని కోరాడు. అయితే, కొన్ని రోజుల తర్వాత కుక్క గత రెండు రోజులుగా ఏడుస్తోందని యజమానికి తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన యాదవ్, మార్చి 26, 27 తేదీల్లో కుక్క ఏడ్చినట్లుగా గమనించాడు.

సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో నిందితుడు షేక్ మార్చి 26 రాత్రి 11.30 గంటలకు సమయంలో కుక్కతో ఆడుకుంటున్నట్లు గమనించాడు. ఆ ప్రాంతంలో చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి దానిపై అఘాయిత్యం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ విషయానికి సంబంధించి, ఏప్రిల్ 11న కాలేపడల్ పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్ 329 మరియు జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం, 1960 సెక్షన్ 11(1)(a) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.