అనుమానం పెను భూతం అని పెద్దలు ఊరికే అనలేదు.. ఒక్కసారి కలిగితే ఎవరొకరి ప్రాణం పొయ్యేవరకు ఆగదు.. ఇక కుటుంబ కలహాల వల్ల ఎందరో భార్య భార్యలు ప్రాణాలను తీసుకున్నారు.. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.. కుటుంబంలో గొడవలు రావడంతో ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపాడు.. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లో వెలుగు చూసింది.. బద్లాపూర్ ప్రాంతంలోని మంజర్లిలో ని దంపతుల ఇంట్లో సోమవారం ఈ ఘటన జరిగింది..
వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని థానే జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా 42 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. బద్లాపూర్ ప్రాంతం లోని మంజర్లిలోని దంపతుల ఇంట్లో సోమవారం ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత ఆ వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడికి, అతని 37 ఏళ్ల భార్య కు కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు జరిగేవని, ఆమె వ్యక్తిత్వాన్ని కూడా అనుమానించాడని అందుకే ఆమెను చంపినట్లు పోలీసులు తెలిపారు..
రోజూ గొడవలు జరుగుతున్నా పెద్దగా ఉండేవి కాదని స్థానికులు చెబుతున్నారు.. కానీ నిన్న జరిగిన గొడవ ఆమె ప్రాణాలను తీసింది.. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో పోలీసులు వారిద్దరిపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు చేశారు. సోమవారం భార్యాభర్తలు మద్యం సేవించి మళ్లీ గొడవ పడ్డారు. అనంతరం నిందితుడు ఆమెను రాడ్డు తో విచక్షణా రహితంగా కొట్టి.. గొంతు నులిమి చంపినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత పొరుగున ఉన్న ముంబయి లో నివాసముంటున్న తన భార్య సోదరుడి ఫోన్ చేసి ఆమెను హత్య చేసినట్లు నిందితుడు మెసేజ్ పంపాడు. బాధితురాలి సోదరుడు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలాని కి చేరుకుని ఇంట్లో మహిళ శవమై ఉండటాన్ని గమనించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..