Site icon NTV Telugu

ఒకరిని ఒకరు పొడుచుకున్న ప్రేమ జంట.. కారణం అదేనంట..?

crime news

crime news

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, మధ్యలో ఏమైందో తెలియదు ప్రియురాలు, ప్రియుడిని దూరం పెట్టింది. దీంతో ప్రియుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకొంది . తనతో పెళ్ళికి నిరాకరించిందని ఆమెపై కక్ష కట్టిన ప్రియుడు ఆమె గొంతు కోసి హతమార్చాడు. ఇక ఆ ఘటనలో తనను తాను కాపాడుకోవడానికి ప్రియురాలు సైతం ప్రియుడిపై దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగు చూసింది.

https://ntvtelugu.com/mass-rape-of-a-minor-girl-in-karnataka-accused-arrested/

వివరాల్లోకి వెళితే.. నామక్కల్‌ జిల్లా పరమత్తి వేలూరులో ఉన్న ఒక నూలు పరిశ్రమలో చత్తీస్‌గడ్‌కు చెందిన తులసి (20), రూపేష్‌ కుమార్‌(24) పనిచేస్తున్నారు. ముందు స్నేహితులుగా పరిచయం అయిన ఆ తరువాత ప్రేమికులుగా మారారు. కొద్దిరోజులు ఎటువంటి విభేదాలు లేకుండా నడిచిన వీరి ప్రేమవ్యవహారం విభేదాలు తలెత్తాయి. దీంతో తులసి, రూపేష్ తో పెళ్లి వద్దనుకుని అతడిని దూరం పెట్టింది. ఇక రూపేష్ ఈ విషయంపై ఆమెతో గొడవపడుతూ వచ్చాడు. శనివారం రాత్రి కూడా ఇదే విషయమై తులసితో గొడవపడిన రూపేష్ కోఫామ్లో పక్కనే ఉన్న కత్తితో తులసి గొంతు కోశాడు. తులసి సైతం తనను తానూ కాపుడుకోవడానికి పక్కనే ఉన్న మరొకత్తితో అతడిని పొడిచింది. ఈ గతంలో తులసి మృతి చెందగా. రూపేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సంచారమే అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, రూపేష్ ని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version