National Flag: ఉత్తర్ ప్రదేశ్ లో జాతీయ జెండాకు అవమానం.. త్రివర్ణ పతాకాన్ని తొలగించి….
- ప్రభుత్వ పాఠశాలలో త్రివర్ణ పతాకానికి అవమానం
- జాతీయ జెండాను తొలగించి..ఇస్లామిక్ జెండా ఎగురవేసిన దుండగులు
- ఏడుగురిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరీలోని ప్రభుత్వ పాఠశాలలో త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. పాఠశాలలో ఉన్న జాతీయ జెండాను తొలగించి.. కొందరు దుండగులు ఇస్లామిక్ జెండాను ఎగురవేశారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ముగ్గురు పేరున్న వ్యక్తులు , నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
లఖింపూర్ ఖేరీలో ఫూల్‌బెహాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖా అలీగంజ్ గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఇస్లామిక్ జెండాను ఎగురవేసిన కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదతో ముగ్గురు నిందితులతో సహా ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తీవ్రం కావడంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
గ్రామంలోని కొంతమంది యువకులు లఖా-అలిగంజ్ గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల పైకప్పుపైకి ఎక్కారు. వారు అక్కడి నుండి త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఇస్లామిక్ జెండాను పెట్టారని ఆరోపించారు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు నిరాకరించడంతో వారిపై దుర్భాషలాడి, బెదిరించినట్లు సమాచారం.
Also Read
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
అదే గ్రామానికి చెందిన సంజయ్ త్రివేది వీడియో తీసి ఫూల్‌బెహాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని పోలీసులు వెల్లడించారు.. దీని తర్వాత, పోలీసులు సద్దాం, బస్రు, అనన్నే అనే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జెండా ఎక్కడి నుండి వచ్చింది, ఏ ఉద్దేశ్యంతో ఎగురవేశారు అనేది దర్యాప్తులో మాత్రమే వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?