Site icon NTV Telugu

Wife kills Husband: భర్త మరణించిన నెలలోపే మరో పెళ్లి.. అప్పుడే అసలు నిజం తెలిసింది..

Crime

Crime

Wife kills Husband: భర్తల్ని ప్రియుడితో కలిసి చంపుతున్న భార్యలు. ఇలాంటి మరో సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రారంభంలో గుండెపోటుతో మరణించాడని అంతా భావించినప్పటికీ, నెల రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని దాదాపు నెల తర్వాత వెలికి తీసిన తర్వాత, గొంతు నొక్కేయడం వల్ల చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలకు చెందిన 50 ఏళ్ల దినసరి కూలీ పరమేష్ జనవరి 29 రాత్రి మరణించాడు. అతడి భార్య 46 ఏళ్ల ఆశ, హౌజ్ కీపింగ్‌ వర్కర్. తన భర్తకు గుండెపోటు వచ్చిందని బందువులుకు చెప్పింది. బంధువులు అంత్యక్రియలు నిర్వహించి, మరుసటి రోజు ఖననం చేశారు.

Read Also: S Jaishankar : ఆధిపత్య కాలం ముగిసింది.. ప్రపంచానికి కొత్త దారి చూపుతున్న భారత్..!

అయితే, భర్త చనిపోయి 20 రోజులు అవ్వకముందే ఫిబ్రవరి 19న ఆశ తన ప్రియుడు 48 ఏళ్ల చంద్రప్పను వివాహం చేసుకుంది. దీంతో కుటుంబీలకు అనుమానం పెరిగింది. పరమేష్ అక్కాచెళ్లిళ్లు అనుమానం వ్యక్తం చేశారు. తమ అన్నది సహజ మరణం కాదని చెబుతూ ఆందోళన వ్యక్తం చేశారు. శరీరంపై అనుమానాస్పద గుర్తులు ఉన్నట్లు చెప్పారు.

దీంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ నమూనాలను సేకరించారు. పోస్టుమార్టం నివేదికలో గుండెపోటు వల్ల మరణించలేదని, ఊరిరాడకుండా గొంతు నొక్కేయడం వల్ల మరణించినట్లు తేల్చారు. విచారణలో ఆశా, చంద్రప్పలు హత్య చేసినట్లు అంగీకరించారు. పరమేష్ నిద్రపోతున్నప్పుడు, దిండుతో భార్య ఆశా, ఆమె ప్రియుడు చంద్రప్పలు కలిసి ఊపిరాడకుండా చేశారు. హత్య తర్వాత గుండెపోటు నాటకమాడి కేసును తప్పుదోవ పట్టించాలని చూశారు.

Exit mobile version