Karnataka Woman Loses 8 Lakhs In Youtube Scam: టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి.. సైబర్ నేరగాళ్లు దాన్ని అడ్డం పెట్టుకొని, కొత్త కొత్త వ్యూహాలతో మోసాలకు పాల్పడుతున్నారు. తేలికైన మార్గాల్లో లక్షాధికారులు అవ్వొచ్చంటూ అమాయకపు ప్రజలను మాయ చేసి.. లక్షలకు లక్షలు దోచేసుకుంటున్నారు. రీసెంట్‌గానే.. మొబైల్ యాప్‌లో సినిమాలను చూసి రేటింగ్ ఇవ్వడం ద్వారా భారీ ఆదాయం పొందవచ్చని చెప్పి, ఒక మమిళను సైబర్ నేరగాళ్లు రూ. 76 లక్షలకు కాజేశారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో భారీ మోసం వెలుగుచూసింది. యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళను నిలువునా దోచుకున్నారు. ఆమె నుంచి రూ. 8 లక్షలు లాగేసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Rudrudu Trailer: లారెన్స్ అన్నా.. ఈసారి ఆత్మలేవీ తీసుకురాలేదానే
ఇంటి పట్టునే కూర్చొని, ఏదైనా ఉద్యోగం చేసుకునే ఆఫర్ ఉందేమోనని ఒక మహిళ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు ఆ మహిళను వాట్సాప్ ద్వారా సంప్రదించారు. యూట్యూబ్ చానళ్లను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే.. భారీ కమీషన్ వస్తుందని ఆమెను ముగ్గులోకి లాగారు. ఒక్క యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్ర్కైబ్ చేస్తే.. రూ.50 ఇస్తామని ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి నమ్మబలికాడు. ఇదంతా నిజమని నమ్మించడం కోసం.. ఆమె టెలిగ్రామ్ ఐటీ తీసుకొని, ఒక గ్రూపులో జత చేశారు. ఆమెకి కొన్ని టాస్కులు అప్పటించి, ఆ పనులన్నీ చేయాలని కోరారు. ఇదంతా చూసి నిజమని నమ్మిన ఆ మహిళ.. వాళ్లు చెప్పినట్లు ఆయా టాస్కులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె నుంచి ఆ ముగ్గురు సైబర్ నేరగాళ్లు రూ. 8.20 లక్షలు లాగేశారు. అనంతరం కాంటాక్ట్‌లో లేకుండా పోయారు.
Sai Prasad Reddy: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. అసంతృప్తి వాస్తవమే..!
ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో.. తాను మోసపోయాయని ఆ మహిళ భావించి, పోలీసుల్ని ఆశ్రయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తుంటే.. తనని ముగ్గురు వ్యక్తులు వాట్సాప్ ద్వారా సంప్రదించారని, టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేసి ఏవేవో టాస్కులు ఇచ్చారని, ఈ గ్యాప్‌లోనే తన నుంచి రూ.8.20 లక్షలు కొట్టేశారని తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని నంబర్ల ద్వారా వాట్సాప్ గానీ, మెయిల్స్ గానీ వస్తే.. ఆ సందేశాలకు స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.