NTV Telugu Site icon

Extramarital Affair: భర్త ఇంట్లో ఉండగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి..

Wife Extramarital Affair

Wife Extramarital Affair

karnataka Woman Attack On Husband With Help Of Lover For Extramarital Affair: వివాహేతర సంబంధాల మోజులో కొందరు మహిళలు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. కుటుంబ విలువలను లెక్క చేయకుండా ప్రియుడితో పారిపోవడమో.. అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భర్తలపై దాడులు చేయించడమో లేదా హత్యలు చేయడమో వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఓ భార్య కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టింది. పరాయి మగాడితో పెట్టుకున్న ఎఫైర్‌ని మానుకోవాలని మందలించిన పాపానికి.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి మరీ భర్తపై దాడి చేసింది ఓ భార్య. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

CV Anand: తస్మాత్ జాగ్రత్త.. టెలిగ్రామ్‌, వాట్సాప్‌ల ద్వారా పెట్టుబడి మోసాలు!

సింగారపేట సమీపంలోని కోనార్‌కొటాయ్‌ గ్రామంలో ఇళంసూర్యన్‌ (47) అనే వ్యక్తి తన భార్య పరిమళ(43)తో కలిసి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల వరకు వీరి సంసార జీవితం సజావుగానే సాగింది కానీ, ఒక వ్యక్తి ఎంట్రీతో వీరి దాంపత్య జీవితం పటాపంచలైంది. కొన్నాళ్ల క్రితం పరిమళకు లక్ష్మీకాంత్ (42) అనే వ్యక్తితో పరిచయం అవ్వగా, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల వరకు వీళ్లు తమ రాసలీలల్ని గుట్టుగానే సాగించారు. అయితే.. ఈమధ్య భార్య ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన ఇళంసూర్యన్.. ఆమెపై ఓ కన్నేసి ఉంచాడు. ఈ క్రమంలోనే పరిమళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోందన్న విషయం అతనికి తెలిసింది. దీంతో.. అతనికి దూరంగా ఉండాలని అతడు భార్యను మందలించాడు.

Extramarital Affair: చెన్నైలో దారుణం..మహిళ ప్రాణం తీసిన అక్రమ సంబంధం..

అయినా పరిమళలో మార్పు రాలేదు. లక్ష్మీకాంత్‌తో తరచూ కలవడం మొదలుపెట్టాడు. ఇక భర్త సహించలేక, అతనితో మరోసారి కలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో కోపాద్రిక్తుడైన భార్య.. అడ్డుగా ఉన్న భర్తని అంతమొందించాలని నిర్ణయించుకుంది. భర్త బెడ్రూంలో ఉన్నప్పుడు.. తన ప్రియుడు లక్ష్మీకాంత్‌కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. అతడు రాగానే.. ఇద్దరు కలిసి ఇళంసూర్యన్‌పై వేటకొడవలితో దాడి చేశారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. పోలీసులు రంగంలోకి దిగి పరిమళ, ఆమె ప్రియుడు లక్ష్మీకాంత్‌లను అరెస్ట్ చేశారు.

Show comments