Karnataka: ప్రేమను తిరస్కరించాడని 3 నెలల పసికందును చంపిన యువతి..

  • కర్ణాటకలోని యాదగిరిలో దారుణం
  • తన ప్రేమను అంగీకరించడం లేదని..
  • యువకుడి మూడు నెలల కోడలిని బావిలో పడేసి చంపిన యువతి
  • జూలై 6వ తేదీన ఘటన
  • యువతికి పాప మేనమామ యల్లప్ప అంటే ఇష్టం
  • పలుమార్లు యువతి ప్రేమను తిరస్కరించిన ఎల్లప్ప.
Karnataka

Karnataka

కర్ణాటకలోని యాదగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదని పదహారేళ్ల యువతి దారుణానికి ఒడిగట్టింది. యువకుడి మూడు నెలల కోడలును బావిలో పడేసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూలై 6వ తేదీన జరిగింది. యువతికి పాప మేనమామ యల్లప్పతో గత రెండేళ్లుగా ఇష్టపడుతుంది. అంతేకాదు.. ఐదుసార్లు ప్రపోజ్ కూడా చేసింది. అయితే.. యల్లప్ప తమ కుటుంబ సంబంధాల గురించి చెబుతూ పలుమార్లు ఆమె ప్రేమను తిరస్కరించాడు.

Read Also: Harom Hara OTT: ఓటీటీకి వచ్చేస్తున్న హరోం హర.. ఎప్పుడు? ఎక్కడ? చూడాలంటే!

ఎల్లప్పపై కోపం పెంచుకున్న యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 3 నెలల పాపను బావిలో పడేసి చంపేసింది. త‌ర్వాత పాప త‌ల్లిదండ్రుల‌ు.. తన కోసం వెతకగా పాపను ఎవరో తీసుకెళ్లారని చెప్పి వారిని తప్పుదారి పట్టించింది. కాగా.. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా.., అసలు నిజాలు బయటపడ్డాయి. యువతి యల్లప్పను నేరానికి పాల్పడే ఉద్దేశంతోనే చిన్నారిని బావిలోకి పడేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also:Hathras stampede: హత్రాస్‌ తొక్కిసలాటపై సుప్రీంలో పిటిషన్..రేపు విచారించినున్న సీజేఐ

పాప మేనమామ అంటే తనకు ఇష్టం ఉండటం, అతనికి ప్రియురాలు ఉండడంతో పగ తీర్చుకునేందుకే ఇలా చేసిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. వీరంతా ఒకే ఇంట్లోనే ఉంటారని తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి యువతి నేరాన్ని అంగీకరించింది. దీంతో.. యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.