NTV Telugu Site icon

Karnataka Crime: నిందితుల్ని పట్టించిన బీర్ బాటిల్ మూత.. కథలో మరో షాకింగ్ ట్విస్ట్

Beer Bottle Cap

Beer Bottle Cap

Karnataka Police Caught Accused In A Crime With Help Of Beer Bottle Cap: ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సీసీటీవీ కెమెరాల్లోనూ వారి కదలికలు కనిపించలేదు. దీంతో.. నిందితుల్ని ఎలా పసిగట్టాలన్నది పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది. అప్పుడే వారికి బీర్ సీసా మూత ఒకటి దొరికింది. అదే ఈ కేసులో ప్రధాన ఆధారంగా అవతరించింది. దాని కోణంలో అధికారులు విచారణ చేపట్టగా.. చివరికి నిందితులు దొరికిపోయారు. అసలేం జరిగిందంటే.. జులై 16వ తేదీన బెంగళూరులోని మిలీనియం బార్‌ వద్ద మిథున్‌రాజ్‌, ముత్తురాజ్‌ అనే స్నేహితులు ఒక ఆటోలో కూర్చున్నారు. ఆటోలో పాటలు పెట్టుకొని, సరదాగా మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Cargo Ship Fire Accident: రవాణానౌకలో అగ్నిప్రమాదం.. 2857 కార్లు దగ్ధం

అప్పుడు నలుగురు వ్యక్తులు సడెన్‌గా ఆ ఇద్దరి వద్దకు వచ్చి, బీర్ బాటిళ్లతో వారిపై దాడి చేశారు. అనంతరం ఆ నిందితులు తమ బైక్‌ల్లో అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుల్ని స్థానికులు గమనించి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. మొదట్లో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరికి సీసీటీవీ కెమెరాలు పరిశీలించినా.. అందులో నిందితుల కదిలికలు లేవు. దీంతో మళ్లీ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు.. అక్కడ ఒక బీర్ బాటిల్ మూత దొరికింది. దానిపై బ్యాచ్ నంబర్ ఉండటంతో.. దాని ఆధారంగా బార్ ఆచూకీ కనుగొన్నారు. ఆ బార్ వద్దకు వెళ్లి చూడగా, అక్కడ సీసీటీవీ కెమెరాలు కనిపించాయి. వాటిని పరిశీలించగా.. నిందితులు బీర్లు కొనుగోలు చేసి, బైక్‌లో వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.

Kadem Project: డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు.. పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అలా నిందితుల ఆచూకీ కనుగొన్న పోలీసులు.. వారి కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఫైనల్‌గా వారి ఆచూకీ కనుగొని, అరెస్ట్ చేశారు. నిందితులను అప్రోజ్‌, రాకేశ్‌, రాజు, ఆదిల్‌ పాషాగా గుర్తించారు. ఇక్కడే మరో షాకింగ్ ట్విస్ట్ కూడా వెలుగు చూసింది. ఆ ఇద్దరిపై ఎందుకు దాడి చేశారు? ఏమైనా శతృత్వం ఉందా? అని పోలీసులు ఆ నిందితుల్ని ప్రశ్నించగా.. వాళ్లేం సమాధానం చెప్పారో తెలుసా? ఊరికే సరదా కోసమే వారిపై దాడి చేశామని చెప్పారు. వాళ్లెవరో తమకు తెలియదని, దారిలో వెళ్తూ వారిపై ఎటాక్ చేశామని చెప్పారు.

Show comments