NTV Telugu Site icon

Man kills wife: పెళ్లయిన కొన్ని గంటలకే భార్యను కొడవలితో నరికి చంపిన భర్త..

Man Kills Wife

Man Kills Wife

Man kills wife: కర్ణాటకలో ఘోరం జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేశాడు. ఈ ఘటన కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. 27 ఏళ్ల నవీన్ కుమార్ తన భార్య 18 ఏళ్ల లిఖిత శ్రీని హత్య చేసి, ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ కుమార్, లిఖిత శ్రీలు ఇద్దరూ సమీప గ్రామాల నివాసితులు. ఆగస్టు 07న వీరిద్దరి వివాహం జరిగింది.

Read Also: Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..

పెళ్లి తర్వాత బంధువుల ఇంటికి వెళ్లే ముందు వధూవరులు అంతా బాగానే ఉన్నారని వారి కుటుంబీకులు చెబుతున్నారు. అయితే, ఓ గదిలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో లిఖితపై నవీన్ కొడవలితో దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఆదే కొడవలితో తను తాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తలుపులు పగలకొట్టి చూడగా, ఇద్దరు రక్తపుమడుగులో పడి కనిపించారని పోలీసులు తెలిపారు.

ఇద్దరినీ బంధువులు ఆస్పత్రికి తరలించారు. నవీన్ సజీవంగా ఉండగా తీవ్రంగా గాయడిన లిఖిత ఆస్పత్రిలో మరణించింది. మెరుగైన వైద్యం కోసం నవీన్‌ని వేరే ఆస్పత్రికి తరలించే చికిత్స అందిస్తున్న సమయంలో గురువారం అతను మరణించాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి, మృతదేహాలకు శవపరీక్ష కోసం తరలించారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Show comments