NTV Telugu Site icon

Extramarital Affair: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏమైందంటే?

Wife Extramarital Affair

Wife Extramarital Affair

Extramarital Affair: వివాహేతర సంబంధాల కారణంగా కేవలం కాపురాలు కూలిపోవడమే కాదు, కొందరి ప్రాణాలు కూడా పోయాయి. తమ ప్రేమకి అడ్డుగా ఉన్నారని కట్టుకున్న వారినే చంపడమో, లేక పరాయి వ్యక్తులతో కులుకుతున్నారన్న కోపంతో హత్య చేయడమో వంటి ఘాతుకాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలోనూ అలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడితో సహజీవనం చేస్తున్న విషయం తెలిసి.. తన భార్యతో పాటు ఆమె ప్రియుడ్ని ఓ భర్త అత్యంత దారుణంగా చంపేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Himantha Biswa Sarma: రాహుల్.. సైన్యం పౌరులపై కాల్పులు జరపాలని సూచిస్తున్నారా?

శివమొగ్గ నగరంలోని వెంకటేశ్వర నగరలోని నివాసం ఉంటున్న కార్తీక్‌కు, శ్రీరామనగరకు చెందిన రేవతికి 2017లో వివాహమైంది. అయితే.. పెళ్లికి ముందే రేవతి తన ఇంటి ముందు ఉండే విజయ్(22)ని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ.. పెద్దలు వీరి ప్రేమని అంగీకరించలేదు. ఈ ప్రేమ విషయం తెలిసిన వెంటనే.. రేవతిని కార్తీక్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లైన మొదట్లో రేవతి బాగానే ఉండేది కానీ, తర్వాత భర్తతో గొడవపడటం మొదలుపెట్టింది. విజయ్‌ని విడిచి ఉండలేక, భర్తకు దూరం అవ్వడం కోసం కావాలనే వాగ్వాదానికి దిగేది. కొన్నిసార్లు పుట్టింటికి కూడా వెళ్లింది. అయితే.. తల్లిదండ్రులు సర్దిచెప్పి కాపురానికి పంపేవారు.

West Godavari Crime: కొడుకు, కోడలి మధ్య విభేదాలు.. మనవడిని మర్డర్‌ చేసిన తాత.. అసలు కథ వేరే ఉంది..!

భర్తకు దూరం అవ్వడం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. రేవతి ఒక ప్లాన్ వేసింది. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి, విజయ్‌తో సహజీవనం చేయడం స్టార్ట్ చేసింది. ఒకవైపు భర్తతో కాపురం చేస్తూనే, మరోవైపు విజయ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్.. తన భార్యతో పాటు ఆమె ప్రియుడ్ని కడతేర్చాలని నిర్ణయించాడు. ఇందుకు తన స్నేహితులు భరత్‌(23), సందీప్‌(21)తో కలిసి పథకం రచించాడు. మాట్లాడే పనుందని చెప్పి.. రేవతి, ఆమె ప్రియుడు విజయ్‌ని ఒక గ్రామంలోని తోటలోకి రమ్మన్నారు. దీంతో.. వాళ్లిద్దరు ఆ తోట వద్దకు వెళ్లారు.

Heart Attack: ఫ్రెషర్స్ డే వేడుకలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి

వాళ్లిద్దరు అక్కడికి చేరుకోగానే.. కార్తీక్, అతని స్నేహితులు వేటకొడవళ్లతో వారిపై ఎగబడ్డారు. వారిని కిరాతకంగా నరికి, తలపై బండరాళ్లతో బాది హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. భర్తే తన స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు. ఇప్పుడు ఈ నేరం నిరూపితం కావడంతో.. కార్తీక్, భరత్, సందీప్‌కు జీవితఖైదు శిక్ష విధిస్తూ.. తలా రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది.