Site icon NTV Telugu

Kadapa Crime: కడపలో దారుణం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

Kadapa

Kadapa

Kadapa Crime: కడప నగరంలోని భగత్ సింగ్ నగర్‌లో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ముక్కుపచ్చలారని చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేశాడు.. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనను స్థానికులు గమనించడంతో, పెను అనర్థం జరగక ముందే ఐదేళ్ల చిన్నారిని రక్షించారు. వెంటనే స్థానికులు రాజ్ కుమార్ అనే నిందితుడిని పట్టుకుని చితకబాదిన అనంతరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

Read Also: Chhangur Baba: “2047 నాటికి ఇస్లామిక్ దేశంగా ఇండియా”.. ఛంగూర్ బాబా కేసులో చార్జిషీట్..

ఇక, ఈ దారుణానికి పాల్పడిన రాజ్ కుమార్ పై ఇప్పటికే ఒక హత్యాయత్నం కేసు సహా మొత్తం ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తెలిపారు. అయితే, స్థానికులు అప్రమత్తం కావడం వల్లనే చిన్నారి సురక్షితంగా బయటపడింది అన్నారు. ప్రస్తుతం పోలీసులు రాజ్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version