ఎన్నోరోజుల తరువాత ఆ అబ్బాయికి పెళ్లి భాజాలు మోగాయి. ఎన్నో ఆశలతో భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. శోభనం రోజున భార్య పల గ్లాసుతో వచ్చింది. ఇక ఇరగతీద్దాం అనుకోని రెడీ అవుతున్న వరుడుకు, వధువు షాక్ ఇచ్చింది. ఆరోగ్య,ఎం బాలేదని చెప్పడంతో వెంటనే వరుడు అర్ధం చేసుకున్నాడు. సరే తెల్లారి అత్తగారింట్లో పూజ చేసిన వధువు .. మొదటిసారి వంట చేసి కుటుంబానికి వడ్డించింది. ఇంకేముంది.. అందరు హాస్పిటల్ పాలయ్యారు. అరెరే ఆ అమ్మాయికి వంట రాదు అనుకోనేరు.. అదేం కాదు ఆ వంటలో నవ వధువు విషం కలిపింది. ఈ దారుణ ఘటన జైపూర్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. కోట్‌పుట్లీ ప్రాంతానికి చెందిన నందు పట్వాకు కొద్ది రోజుల క్రితం పూజా రాజి అనే యువతితో పెళ్లి జరిగింది. రెండు రోజులు అత్తవారింట్లో ఉన్న పూజా శుక్రవారం రాత్రి ఇంట్లో అందరికి భోజనంలో విషం కలిపి వడ్డించింది. వారందరు ఆ భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత పూజా ఇంట్లో ఉన్న నగదు, నగలతో ఉడాయించింది. ఉదయం ఎంతసేపు తలుపు తెరవకపోడంతో పక్కింటివారు తెలుపులు బద్దలుకొట్టి చూడగా అందరు స్పృహ కోల్పోయి పడి ఉండడంతో వారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వారందరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మధ్యవర్తి ద్వారా పెళ్లి కుదిరిందని, పెళ్లి చేసినందుకు అతనికి లక్ష కన్నా ఎక్కువే ముట్టజెప్పినట్లు తెలిపారు.
