సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాగ్రామ్ లో రషీద అనే యువతితో స్నేహ్నం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా.. ప్రేమకు దారితీసింది. ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో రషీద జులై 4న ఇంట్లో ఉన్న రూ. 1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారం తీసుకుని ఇంటి నుంచి ఎటో పరార్ అయింది.
ఎన్నోరోజుల తరువాత ఆ అబ్బాయికి పెళ్లి భాజాలు మోగాయి. ఎన్నో ఆశలతో భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. శోభనం రోజున భార్య పల గ్లాసుతో వచ్చింది. ఇక ఇరగతీద్దాం అనుకోని రెడీ అవుతున్న వరుడుకు, వధువు షాక్ ఇచ్చింది. ఆరోగ్య,ఎం బాలేదని చెప్పడంతో వెంటనే వరుడు అర్ధం చేసుకున్నాడు. సరే తెల్లారి అత్తగారింట్లో పూజ చేసిన వధువు .. మొదటిసారి వంట చేసి కుటుంబానికి వడ్డించింది. ఇంకేముంది.. అందరు హాస్పిటల్ పాలయ్యారు. అరెరే…