Betting Apps : ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యం వ్యసనాలతో అప్పులపాలై డబ్బు కోసం హత్యకు దిగిన ఇంజినీరింగ్ విద్యార్థి శివ మాధవ రెడ్డి (23)ని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి, నిహారిక (21) దంపతులు వెంకటేశ్వరనగర్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 12న డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న భర్త దేవేందర్ రెడ్డి, బాత్‌రూమ్‌లో నిహారిక పడి ఉండటం గమనించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
CM Nitish Kumar: ప్రజలు మా పట్ల నమ్మకం ఉంచారు.. ప్రతీ ఓటరుకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు..!
ప్రాథమిక విచారణలో ఇది సహజ మరణం కాదని, నిహారికను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. అదే రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న నిహారికను శివ మాధవ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నాడని విచారణలో బయటపడింది. భర్త పనికి వెళ్లడం, పొరుగువారు ఇంట్లో లేకపోవడం నిర్ధారించుకుని నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై దాడి చేసి గొంతు కోసి హత్య చేసిన అనంతరం, ఇది సహజ మరణం అన్నట్లు సీనును సృష్టించాడు.
తరువాత బంగారు మంగళసూత్రం, బంగారు చెవిపోగులు, మూడు బంగారు ఉంగరాలు, రూ. 2,500 నగదు దొంగిలించి అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడి వద్ద నుండి ఒక ద్విచక్రవాహనం, రెండు మొబైల్ ఫోన్లు, దొంగిలించిన నాలుగు తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ కేసును విజయవంతంగా చేదించిన జగద్గిరిగుట్ట పోలీసులు, SOT , CCS బృందాలను డీసీపీ అభినందించారు.
Narendra Modi : మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం
