Site icon NTV Telugu

Snapchat Trap: స్నాప్‌చాట్ ద్వారా ట్రాప్.. కలవకపోతే న్యూడ్ ఫోటోస్ వైరల్ చేస్తానంటూ బెదిరింపులు

Snapchat Trap Case

Snapchat Trap Case

Hyderabadi Boy Trapped A Girl Via Snapchat And Harassed Her With Nude Pics: కొందరు కీచకులు అమ్మాయిల్ని ట్రాప్ చేసి, తమ కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు. హైదరాబాద్‌లో తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన ఓ యువతిని ట్రాప్ చేసి.. ఆమెతో తన కామవాంఛ తీర్చుకోవాలని ఓ దుర్మార్గుడు ప్రయత్నించాడు. అయితే.. ఆ యువతి చాకచక్యంగా వ్యవహరించి పోలీసుల్ని ఆశ్రయించడంతో, బతికి బయటపడింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Husband Killed Wife: ‘ఫోన్’ పెట్టిన చిచ్చు.. భార్యని కాల్వలో తోసేసి హత్య చేసిన భర్త

హైదరాబాద్‌కు చెందిన అలీ అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం బీటెక్ చదువుతున్న ఓ అమ్మాయి స్నాప్‌చాట్ ద్వారా పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇద్దరు తరచూ చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆ యువతితో చనువు పెంచుకొని, తన ట్రాప్‌లో పడేశాడు. ఒకరోజు పర్సనల్ వీడియో కాల్ చేయమని అలీ చెప్పగా.. ఆ యువతి వీడియో కాల్ చేసింది. అప్పుడు అలీ ఆమెతో మాట్లాడుతూ.. స్క్రీన్ షాట్స్ తీశాడు. అనంతరం.. తనని కలవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. తనని కలవకపోతే, ఆ పర్సనల్ ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. అతని దెబ్బకు భయభ్రాంతులకు గురైన ఆ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా వివరాలతో అలీని పట్టుకున్నారు. అనంతరం అతడ్ని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. అతడ్ని విచారించగా.. ఇలాగే చాలామంది అమ్మాయిల్ని ట్రాప్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది.

Etela Rajender: మా మధ్య ఎలాంటి గ్యాపులు లేవు.. ఈటల క్లారిటీ

ఈ ఘటనపై కరాటే కళ్యాణి సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. హిందువుల అమ్మాయిలను కొందరు కావాలనే ట్రాప్ చేస్తున్నారని మండిపడింది. తాజాగా తాము హైదరాబాద్‌లో లవ్ జిహాద్ ఘటనని ఆపామని తెలిపారు. స్నాప్‌చాట్ ద్వారా అమ్మాయిని ట్రాప్ చేసి, ఆమెని లోబరుచుకునేందుకు ప్రయత్నించాడన్నారు. ఇలాగే ఎంతోమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడని, ఆ అబ్బాయి ఫోన్ చెక్ చేస్తే వాస్తవాలు బయటకి వస్తాయని అన్నారు. ఇదే సమయంలో బాధిత యువతి మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం అలీ తనకు ఆన్‌లైన్‌లో పరిచమయ్యాడని తెలిపింది. మంచిగా మాట్లాడుతూ అతడు దగ్గరయ్యాడని.. అతడు బలవంతం పెట్టడం వల్ల పర్సనల్ వీడియో కాల్ చేశానని చెప్పింది. కానీ.. అతడు ఫోటోలు క్యాప్చర్ చేసి, తనని కలవాలని ఒత్తిడి చేశాడని, లేకపోతే ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించాడని పేర్కొంది. ఏం చేయాలో తెలీక.. తాను హిందూ సంఘ నాయకులకు సమాచారం ఇచ్చానని వివరించింది.

Exit mobile version