Site icon NTV Telugu

Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..

Rape

Rape

Atrocious: హైదరాబాద్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం చోటుచేసుకుంది. రన్నింగ్ ప్రైవేట్ బస్సులో ఈనెల 18 న ఘటన జరిగింది. అయితే ఈ ఘటపై ఈనెల 21న చౌటుప్పల్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

కూకట్ పల్లిలో ఓ మహిళా ప్రయాణికురాలు మార్నింగ్ ట్రావెల్స్ బస్సులో ఎక్కింది. విజయవాడకు వెళ్లాలని చెప్పడంతో టికెట్‌ ఇచ్చిన కండెక్టర్‌ ఆమెకు కూర్చునేందుకు సీటు చూపించాడు. అక్కడ కూర్చున ఆమె నిద్రలోకి జారిపోయింది. బస్సు క్లీనర్‌ ఆమె వద్దకు వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ ను కూకట్ పల్లి పోలీస్‌ స్టేషన్ కు బదిలీ చేశారు. అయితే బస్సులో అత్యాచారం చేసినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేరా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ ట్రావెల్స్ బస్సు యజమానిని సంప్రదించి క్లీనర్‌, బస్సు నడిపిన డ్రైవర్‌ వివరాలను ఆరా తీస్తున్నారు.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శానికి 8గంటల సమయం..

Exit mobile version