Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amulya Sri: సినీ రంగంలో హీరోయిన్గా రాణించాలంటే.. ఆషామాషీ కాదు. టాలెంట్ ఒక్కటే సరిపోదు. రంగుల ప్రపంచంలో ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదురవుతాయి. అవన్నీ తట్టుకుని నిలబడగలిగేతేనే చివరకు విజయం సొంతమవుతుంది. ఇది తెలియక చాలా మంది.. తెరపై కనిపించలని గంపెడాశలు పెట్టుకుని మృగాళ్ల చేతిలో చిక్కి జీవితాలు ఆగమాగం చేసుకుంటున్నారు. అలాంటి ఓ యవతి గాథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ యువతి ఎవరు? అసలు ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది?
ఒక్క ఛాన్స్.. ప్లీజ్..నేనోంటో నిరూపిస్తా… ఖడ్గం సినిమాలో ఈ డైలాగ్ గుర్తుంది కదా.. ఆ సినిమాలో హీరోయిన్ సంగీత.. సినిమాలో ఒక్క ఛాన్స్ కోసం పరితపిస్తుంది. పెద్ద హీరోయిన్ కావాలని కలల కంటుంది. కానీ.. రంగుల ప్రపంచంలో అడుగడుగునా తోడెళ్లు ఉంటాయని తెలుసుకోలేక.. హీరోయిన్ కావాలనే ఒకే ఒక్క ఆశతో తోడేళ్ల వలకు చిక్కుతుంది. అది రీల్ స్టోరీ.. కానీ సరిగ్గా ఇలాంటివే ఎన్నో.. ఎన్నెన్నో..రియల్ స్టోరీలోనూ జరుగుతున్నాయి. కానీ కొన్ని వెలుగులోకి వస్తున్నాయి.. మరికొన్ని రంగుల ప్రపంచం మాటున నీలి నీడల్లో కలిసిపోతున్నాయి. అలాంటి ఓ యువతి కన్నీటి గాథ ఇప్పుడు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. సినీ వినీలాకాశంలో ధృవతారగా కాంతులీనాలని.. ఎన్నెన్నో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువతి జీవితం అర్థాంతరంగానే ముగిసిపోయింది. కొందరు మృగాళ్ల చేతిలో పడిన ఆమె.. సినీరంగంలో తారగా మెరవాల్సింది పోయి.. చుక్కల్లోకెక్కి.. ఆకాశంలో తారగా మిగిలిపోయింది.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ఆ యువతి పేరు అమూల్య శ్రీ. చక్కని ఆహార్యం.. చూడచక్కని అభినయం.. ప్రతిభతో షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని వెండితెరపై హీరోయిన్గా రాణించాలని కలలు కన్నది. అందుకోసం కష్టపడుతున్న సమయంలో.. కొందరు కామాంధుల చేతిలో పడి మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది. చివరకు బలవన్మరణానికి పాల్పడి జీవితాన్ని ముగించేసింది. కొంత మంది పోకిరీలు.. ఆమె పాలిట తోడేళ్లుగా మారారు. అమూల్య శ్రీకి సంబంధించిన బాత్రూం వీడియోలను రహస్యంగా చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని గత ఆరు నెలలుగా ఆమెను తీవ్రంగా బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. తమ కోరికలను తీర్చాలని, లేదంటే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులతో అమూల్య తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేధింపులకు సంబంధించి అమూల్య శ్రీ.. పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో కొంతకాలం వేచి చూసిన అమూల్య శ్రీ.. చివరకు విసిగి వేసారి.. తీవ్ర మనోవేదనతో తన అమూల్యమైన జీవితాన్ని ముగించింది.
అమూల్య మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఆమె తల్లి కన్నీరుమున్నీరవుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన కుమార్తె మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి దాదాపు పది రోజులు గడుస్తున్నప్పటికీ ప్రధాన నిందితులను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్య శ్రీ మృతి పట్ల.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే వేగంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో నలుగురు యువకులతో పాటు ఒక యువతి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఘటన సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్ఫీల్డ్ Classic 650 Hypershift ఎడిషన్ లాంచ్.. 648cc ఇంజిన్, ధర ఎంతంటే?!
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!