Site icon NTV Telugu

Hyderabad: చర్లపల్లి స్టేషన్‌లో మహిళా మృతదేహం.. ఎవరు ఆ మహిళ? హత్య చేసింది ఎవరు?

Dead Body

Dead Body

Hyderabad: నేరస్తులు.. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. నేరాలకు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా పోయింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఇటీవల అత్యాధునికంగా తీర్చిదిద్దారు. కానీ అక్కడే నేరస్తులు ఓ డెడ్ బాడీని సంచిలో తీసుకు వచ్చి పడేసి.. తాపీగా ట్రెయిన్ ఎక్కి వెళ్లిపోయారు. అసలు చనిపోయిన మహిళ ఎవరు? చంపింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలే అక్కడి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. చుట్టు పక్కల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాంటి ప్రాంతంలోనూ నేరాలు ఆగడం లేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడను ఆనుకుని.. తెల్లటి ప్లాస్టిక్ సంచిలో నుంచి రక్తం కారడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సంచిని ఓపెన్ చేసి చూడడంతో అందులో మహిళ శవం కనిపించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు.

Suicide Attempt: ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో కుటుంబం మొత్తం..?

ఆ మహిళ ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అక్కడ ఎవరు డెడ్ బాడీని పడేశారు? హంతకులు ఎటు వెళ్లిపోయారు? అనే కోణంలో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా నిందితున్ని గుర్తించారు. 2 రోజుల క్రితం మృతదేహంతో ఓ యువకుడు ఆటోలో వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. గోడ పక్కన డెడ్ బాడీతో ఉన్న సంచిని పడేశాడు. ఆ తర్వాత నేరుగా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాడు. అక్కడే లాంజ్ రూమ్‌కు చేరుకున్నాడు. తర్వాత.. అక్కడే స్నానం చేశాడు. బట్టలు మార్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అస్సాం వెళ్తున్న ట్రెయిన్ ఎక్కి వెళ్లిపోయాడు.

నిందితున్ని గుర్తించినప్పటికీ.. అతడు ఎవరు? ఏంటి ? అనే విషయాలు తెలియలేదంటున్నారు పోలీసులు. అటు మహిళ ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. ప్రస్తుతానికి అన్‌నోన్ డెత్‌గా కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. ఏవైనా సాంకేతిక ఆధారాలు దొరికితే కేసును ఛేదిస్తామని చెబుతున్నారు. మహిళ డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా హత్య మరువక ముందే.. చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్‌లో మరో మహిళ మృతదేహం కలకలం రేపింది. వరుసగా ఇలాంటి ఘటనలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

AP Crime: అప్పులు ఎగ్గొట్టడానికి డబుల్ మర్డర్‌.. రెప్పపాటులో తప్పించుకున్న మూడో వ్యక్తి..

Exit mobile version