Saidabad: హైదరాబాద్ లోని సైదాబాద్ బాలసదన్‌లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. హోమ్‌లో నివసిస్తున్న ఒక బాలుడిపై స్టాఫ్ గార్డ్ లైంగిక దాడికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం అనుమతి లేకుండా ఆ గార్డ్ బాలుడిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లిన తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చెక్ చేయగా.. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు.
50MP+50MP కెమెరా సెటప్, 120Hz రిఫ్రెష్ రేట్ తో లాంచ్ కు సిద్దమైన Motorola Edge 70..!
తల్లిదండ్రులు వెంటనే బాలసదన్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, స్టాఫ్ గార్డును అరెస్ట్ చేశారు. దర్యాప్తులో మరో నలుగురు బాలలపై కూడా అదే గార్డ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిసింది. ప్రస్తుతం అధికారులు బాలసదన్ లోని ఇతర పిల్లలపై కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Bigg Boss 9 : కాంట్రవర్సీ ఉన్నోళ్లే కావాలి.. బిగ్ బాస్ తిడుతున్నా పట్టించుకోవా..
