Hyderabad: హైదరాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ఆధిపత్యం, పాతకక్షల నేపథ్యంలో ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ హత్య జరుగుతుందో తెలియక సామాన్య జనం హడలి పోతున్నారు. హైదరాబాద్‌లో ఎల్లమ్మబండలో తాజాగా జరిగిన రౌడీషీటర్ హత్య కలకలం రేపుతోంది. ఎల్లమ్మబండలోని గుడ్ విల్ హోటల్‌లో మహబూబ్ అనే రౌడీ షీటర్ టీ తాగడానికి వచ్చాడు. అతని రాకపై సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు రంగంలోకి దిగారు. అప్పటికే మర్డర్ ప్లాన్ వేసిన ముగ్గురు నిందితులు ఆటోలో అక్కడి చేరుకున్నారు. రావడమే ఆలస్యం.. మహబూబ్‌పై కత్తులతో విరుచుకుపడ్డారు. క్షణాల్లో తలపై వేటు వేసి అక్కడి నుంచి పారిపోయారు..
READ MORE: Hyderabad: పూటకోవేశం.. జనాలను చీట్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు..
ఈ కేసుపై స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీలు అన్ని జల్లెడ పడుతున్నారు. మరోవైపు చనిపోయిన రౌడీషీటర్ మహబూబ్ పై 13 కేసులు ఉన్నాయి. అందులో ఓ మర్డర్ కేసు కూడా ఉంది. మహబూబ్ పై కక్ష సాధింపుతోనే హత్య జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా పట్టపగలే హైదరాబాద్ లో మర్డర్ జరగడం కలకలం రేపుతోంది. ఈ హత్యకు స్థానికులు భయాందోళన చెందుతున్నారు..
READ MORE: Off The Record: మూడు సార్లు గెలిపించినా ముఖం చూడ్డంలేదు.. ఎమ్మెల్యేపై కేడర్ ఫైర్..!
