Hyderabad: హైదరాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ఆధిపత్యం, పాతకక్షల నేపథ్యంలో ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ హత్య జరుగుతుందో తెలియక సామాన్య జనం హడలి పోతున్నారు. హైదరాబాద్‌లో ఎల్లమ్మబండలో తాజాగా జరిగిన రౌడీషీటర్ హత్య కలకలం రేపుతోంది. ఎల్లమ్మబండలోని గుడ్ విల్ హోటల్‌లో మహబూబ్ అనే రౌడీ షీటర్ టీ తాగడానికి వచ్చాడు. అతని రాకపై సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు రంగంలోకి దిగారు. అప్పటికే మర్డర్ ప్లాన్ వేసిన ముగ్గురు నిందితులు ఆటోలో అక్కడి చేరుకున్నారు. రావడమే…