Rash Driving Case: వదలొద్దు ఆ పోకిరీలను.. కుషాయిగూడ రాక్షసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Rash Driving

Rash Driving

Rash Driving Case: హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో ఓ బొలేరో వెహికిల్‌‌తో సైరన్‌ వేసుకుని ర్యాష్‌ డ్రైవింగ్‌తో హంగామా చేసిన యువకులను పోలీసులు పట్టుకున్నారు. రద్దీ రోడ్లపై మద్యం మత్తులో ఓవర్‌స్పీడ్‌తో వెళ్తూ.. న్యూసెన్స్‌ క్రియేట్‌ చేశారు. ఓ వ్యక్తిని ఢీకొట్టి కిలోమీటర్‌ వరకు కారుతోనే ఈడ్చుకుంటూ వెళ్లి… రాక్షసుల్లా ప్రవర్తించారు. అలాంటి ఇద్దరు సైకో గాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బొలేరో కారు నంబర్ ఆధారంగా ఆ ఇద్దరు యువకులను మహేష్‌, తరుణ్‌‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండటమే కాకుండా… కారును ఓవర్‌స్పీడ్‌గా, ర్యాష్‌గా నడిపినట్లు చెబుతున్నారు పోలీసులు.

READ ALSO: Jagtial Murder: జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్‌‌కి తరలించామంటున్నారు. బొలోరో కారుపై తెలంగాణ కన్జూమర్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ సెక్రెటరీ అని రాసి ఉంది. దీని ఆధారంగానూ పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. మహేష్‌ తండ్రి ఈ తెలంగాణ కన్జూమర్‌ రైట్స్‌ సెక్రెటరీ వెహికిల్‌‌కి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెక్రెటరీ అందుబాటులో లేనప్పుడు మహేష్‌ తండ్రి ఆ కారును నేరుగా ఇంటికి తీసుకుని వస్తుంటాడు. ఇదే తరహాలో కారును తీసుకొచ్చాడు. ఇంటి వద్ద కారు కనిపించడంతో.. తండ్రికి తెలియకుండా కారు తీసుకుని స్నేహితుడు తరుణ్‌ తో రోడ్డెక్కాడు మహేష్‌. ఇద్దరూ మద్యం సేవించి.. కారును స్పీడ్‌గా నడుపుతూ న్యూసెన్స్‌ చేశారని.. కారుకి సైరన్‌ కూడా ఉండటంతో సైరన్‌ మోగిస్తూ.. స్పీడ్‌గా వెళ్తూ.. పైశాచికానందం పొందినట్లు చెబుతున్నారు పోలీసులు. ఈ ఇద్దరు యువకులు స్థానికంగా పెయింటర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించామన్నారు.

కారు సతీష్‌ మీదకు ఎక్కడంతో… ఆయన ప్రైవేట్‌ పార్ట్‌ నుజ్జునుజ్జు అయ్యింది. కాలు విరిగింది. అప్పటికే వీపంతా చెక్కుకుపోయి.. ఎముకలు బయటకు తేలాయి. తీవ్ర గాయాలపాలైన సతీష్‌ను వాహనదారులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సతీష్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి పోకిరీలను ఊరికే వదలవద్దని సతీష్ బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప సామాన్యులు రోడ్ల మీద వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు.

READ ALSO: Ibrahimpatnam Drama: గెలిచినా దక్కని చైర్మన్ పదవి.! హైకోర్టు స్టేతో నిలిచిన ఇబ్రహీంపట్నం ఎన్నికల ఫలితం.!