Hyderabad: భార్యపై అనుమానంతో.. అందరూ చూస్తుండగానే నరికి చంపిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wife : ఇప్పుడు దేశం మొత్తం ఒకటే ట్రెండ్ నడుస్తోంది. భర్తలను చంపడమే పనిగా పెట్టుకున్నారు భార్యలు.. అంతేకాదు పెళ్లి చేసుకున్న నెల రోజులకే భర్తలను తీసుకెళ్లి చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి భర్తలను ట్రాప్ చేసి మరీ కడతేర్చుతున్నారు. అయితే ట్రెండ్‌కు భిన్నంగా హైదరాబాద్‌లో ఒక ఘటన జరిగింది. మరో వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను చంపేశాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. ఓ వైపు మేనకోడలు కూతురు పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగానే.. భార్యను అందరి ముందే కర్కశంగా నరికి చంపేశాడు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్‌లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది..
READ MORE: PM Modi: అప్రూవల్ రేటింగ్స్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నరేంద్ర మోడీ..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ సమ్మక్క దంపతులు. సమ్మక్క అక్క కళావతితో శ్రీనివాస్‌కు గతంలో వివాహమైంది. శ్రీనివాస్పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కళావతి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు, పెద్దలు మాట్లాడుకుని శ్రీనివాస్‌కు సమ్మక్కను ఇచ్చి రెండో వివాహం చేశారు. ఐతే వీరికి కూడా ఇద్దరు పిల్లలున్నారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో అనుమానం చిచ్చు పెట్టింది. సమ్మక్కపై శ్రీనివాస్‌కు అనుమానం పెరిగింది. మరో వ్యక్తితో భార్య సమ్మక్క చనువుగా ఉంటున్నట్లు గుర్తించి… నిత్యం గొడవ పడేవాడు. ఇలా కొన్ని రోజుల క్రితం చాలా గొడవలు జరిగాయి. ఇదే విషయం పై గత 15 రోజుల క్రితం సూర్యాపేటలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా చేశారు. ఆ తర్వాత సమ్మక్క హైదరాబాద్ వచ్చి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉంటోంది. శ్రీనివాస్ మేనకోడలయిన రాజేశ్వరి కూడా సమ్మక్క ఉండే బీసీ కాలనీలో నివాసముంటోంది.
READ MORE: Off The Record: సిల్లీ విషయంలో సీరియస్ గా తలబడ్డ ఇద్దరు పెద్ద నాయకులు?
రాజేశ్వరి కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా సమ్మక్కను వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజుకు ఇంటికి పిలిచారు. అందులో భాగంగా శ్రీనివాస్, సమ్మక్క కూడా బర్త్‌డేకు వచ్చారు. రాజేశ్వరి కుమార్తె కేక్ కట్ చేసే క్రమంలో సమ్మక్క.. తన ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాస్ ఒక్కసారిగా సమ్మక్కపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క అక్కడే మృతి చెందింది. అనంతరం శ్రీనివాస్ అక్కడ నుండి సూర్యాపేటకు పారిపోయాడు. ఈ ఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమ్మక్క హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు. భర్త శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!