Honey Trap: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీట్రాప్, బ్లాక్‌మెయిలింగ్ కేసులో కీలక నిందితుడు పవన్ కుమార్ పోలీస్ కస్టడీ విచారణ పూర్తయింది. సైదాబాద్ పోలీసులు నిందితుడిని సుదీర్ఘంగా విచారించి, ఈ రాకెట్‌కు సంబంధించిన విస్మయకర విషయాలను రాబట్టారు. కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం పవన్‌ను దర్యాప్తు అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. గే డేటింగ్ యాప్ ‘గ్రైండర్’ (Grindr) ద్వారా పరిచయాలు పెంచుకుంటూ, ‘క్లబ్ జిందగీ’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను నడిపిస్తూ పవన్ భారీ నెట్‌వర్క్‌ను విస్తరించాడు. స్వలింగ సంపర్కులను, ప్రముఖులను హోటళ్లకు రప్పించి రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు. ఇప్పటివరకు సుమారు వెయ్యి మందితో చాటింగ్‌లు చేయగా, 82 మందికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు.
ఈ ఉచ్చులో సామాన్యులే కాక పోలీసు ఉన్నతాధికారులు కూడా చిక్కుకోవడం కలకలం రేపుతోంది. డీఐ బాలస్వామి నుంచి రూ.7.5 లక్షలు (ఆయనతో కలిసి గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వెళ్లినట్లు గుర్తింపు), ఓ అదనపు డీసీపీ నుంచి రూ.3 లక్షలు, మరో ఏసీపీ నుంచి సుమారు రూ.5 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఏడాదిన్నర కాలంలోనే వివిధ మార్గాల్లో బాధితుల నుంచి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. యువతుల ఫేక్ ప్రొఫైల్స్‌తో చాటింగ్ చేయడం, ఆపై “మీ వేధింపులు భరించలేక మా చెల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం” అంటూ భయపెట్టేవాడు. మరికొందరి వద్ద “మా అమ్మకు తీవ్ర అనారోగ్యంగా ఉంది” అంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌తో మానవీయ కోణంలో నగదు గుంజేవాడు. హనీట్రాప్లే కాకుండా శబరిమల అయ్యప్ప స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి వీఐపీ దర్శనాలు చేయిస్తానంటూ భక్తులను కూడా బురిడీ కొట్టించినట్లు నిర్ధారణ అయింది.
నిందితుడికి చెందిన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఖాతాలను గుర్తించిన పోలీసులు వాటిని ఫ్రీజ్ చేశారు. కొత్తగూడెంలోని యూనియన్ బ్యాంక్ ఖాతా సహా మొత్తం ఖాతాల్లో ఉన్న రూ.2 లక్షల నగదును స్తంభింపజేశారు. పవన్‌పై ఇప్పటికే సైదాబాద్‌తో పాటు ఖైరతాబాద్/సైఫాబాద్, ఎస్సార్ నగర్, తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ దందా వెనుక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. హనీట్రాప్ కేసులో నిందితుడు పవన్ కుమార్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైదాబాద్ పోలీసుల కస్టడీ విచారణ ముగియడంతో కాసేపట్లో నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. గే యాప్‌లు, ఫేక్ ప్రొఫైల్స్ అడ్డాగా పోలీసు ఉన్నతాధికారులనే టార్గెట్ చేసి లక్షలు గుంజిన పవన్ లీలలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు..
హనీట్రాప్ కేడీ పవన్ మోసాల చిట్టా విప్పేకొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. గ్రైండర్ యాప్ ద్వారా స్వలింగ సంపర్కులను ట్రాప్ చేయడం, హోటళ్లకు రప్పించి ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం పవన్ ప్రధాన పని. ఇప్పటివరకు ఏకంగా వెయ్యి మందితో చాటింగ్‌లు నడపగా, 82 మందికి సంబంధించిన అభ్యంతరకర వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులే ప్రధాన బాధితులుగా ఉండటం సంచలనం రేపుతోంది. డీఐ బాలస్వామి నుంచి ఏడున్నర లక్షలు, అడిషనల్ డీసీపీ నుంచి మూడు లక్షలు, ఓ ఏసీపీ నుంచి ఐదు లక్షల వరకు పవన్ వసూలు చేసినట్లు కస్టడీలో వెల్లడైంది. నిందితుడికి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు.. మరిన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

