Ganja Seizure : ఇదిలావుండగా, హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈగల్ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ రవాణాను అడ్డుకున్నారు. నగర శివార్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన అధికారులు ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 270 కిలోల గంజాయిని పట్టుకుని సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 1.50 కోట్లు ఉంటుందని ఈగల్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ దందాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ముఠాలోని మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

