Hit and Run: తాతలు, తండ్రులు ఆస్తులు సంపాదించారు. ఈ క్రమంలో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించాడు. కన్ను మిన్నూ కానకుండా కారు నడిపించాడు. ఒకరి మృతికి కారణమయ్యాడు. ఐతే స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో నిందితున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరతడు? అసలు జరిగిందేంటి?
హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు.. అతడి కార్ వేగానికి అంతులేదు.. ఎవరైనా అడ్డం వస్తే అలాగే ఢీకొడతాడు. ఇంకా చెప్పాలంటే కారుకు బ్రేక్‌లున్నా పెద్దగా వాడడు. ఎవరైనా అడ్డం వస్తే అలాగే ఢీకొట్టుకుంటూ వెళ్లిపోతాడు. అడిగేవాడు ఎవరూ లేరని అతని తీరు. అతడే హైదరాబాద్‌లో బడా వ్యాపారం నిర్వహిస్తున్న మస్కతీ వారసుల్లో ఒకడైన రేహన్ మస్కతీ.
Crime News: ఆరేళ్ల ప్రేమ.. 6 రోజులు కూడా కాపురం చేయక ముందే!
చాంద్రాయణగుట్ట ప్రాంతంలో రేహన్ మస్కతి తన ఫార్చునర్ కారులో అత్యంత వేగంగా వెళుతున్నాడు. ఈ సమయంలో కార్ ముందు వెళ్తున్న వాళ్లని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరు ఆసుపత్రిలో చనిపోయారు. ఆక్సిడెంట్ చేసిన తర్వాత మస్కృతి చాలా నిర్లక్ష్యంగా ఏమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు తీసి స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే బాధితులను కనీసం పరామర్శించకుండా వాళ్లని ఆసుపత్రి తీసుకొని వెళ్లకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. చావు బతుకుల మధ్య బాధితుడు కొట్టు మిట్టాడుతూ చివరికి ప్రాణం వదిలాడు.
Illegal Liquor: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ.. లిస్టులో ప్రముఖుల పేర్లు!
ఈ హిట్ అండ్ రన్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రెహాన్ మస్కతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన కాంగ్రెస్ నాయకుడు అలీ మస్కతి కుమారుడు రేహాన్ మస్కతిపై బీఎన్‌ఎస్ 106(1) సెక్షన్ కింద బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ఫార్చూనర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
