Site icon NTV Telugu

భాగవతం పేరుతో భార్య గుడివెనక బాగోతం.. భర్త ఏం చేశాడంటే..?

extramarital affair

extramarital affair

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి.. ఇంట్లో కట్టుకొన్నవారితో గొడవలు పరాయి వారిని దగ్గరకు చేర్చుతున్నాయి. ఇంట్లో దొరకని సుఖం బయట దొరుకుతుందని ఆవేశపడి కట్టుకున్నవారిని మోసం చేసి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఒక భార్య భర్తతో గొడవలు పడలేక మరొక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. ఇక ఈ విషయం తెలిసిన భర్త కోపంతో ఊగిపోతూ భార్యను కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నాలో నివాసముండే ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో సజావుగా సాగిన వీరి కాపురంలో కొద్దికొద్దిగా మనస్పర్థలు మొదలయ్యాయి. అవి రోజురోజుకు పెరుగుతుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక భర్తతో గొడవల వలన విసిగిపోయిన భార్య అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోంది. భర్తకు తెలియకుండా రోజు గుడి వద్ద భాగవతం వింటానని చెప్పి ప్రియుడిని కలిసి వచ్చేది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఇంట్లో భర్తకు గుడికి వెళ్తున్నానని చెప్పి బయటికి వచ్చి, గుడి వెనక ప్రియుడితో రాసలీలల్లో మునిగి తేలింది.

ఇక భర్త స్నేహితుడు వారిద్దరిని చూసి ఫోన్ చేసి భర్తకు విషయం చెప్పాడు. వెంటనే గుడికి బయల్దేరి భార్య రాసలీలలను కళ్లారా చుసిన భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు. గుడి నుంచి ఇంటికి వచ్చిన భార్యను ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఇక ఆ శబ్దానికి చుట్టుపక్కల వారు మేల్కొనడంతో భర్త పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న భార్యను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version