Site icon NTV Telugu

Wife Murder: భర్త కిరాతకం.. భార్యను అడవిలో పూడ్చి

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. కళ్ళలో పెట్టుకుని కాపురం చేయాల్సిన మొగుడు ఆమెని అతి కిరాతకంగా హతమార్చాడు. భార్యను బతికుండగానే అడవిలో పూడ్చిపెట్టాడో కర్కోటక భర్త ఉదంతమిది. తమిళనాడులో కలకలం రేపిన శాడిస్టు భర్త తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది, బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త తాపీగా తన పనులు తానుచేసుకోవడం ప్రారంభించాడు.

వేలూరు జిల్లా కాట్పాడీలో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ళ క్రితం సుప్రజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు వినాయకం. అనుమానంతో పాటు అనారోగ్యంతో ఉన్న భార్యని వేధించడం ప్రారంభించాడు వినాయకం. రెండు నెలలు క్రితం భార్యను తీవ్రంగా కొట్టాడు వినాయకం. ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో తన తమ్ముడు విజయ్,స్నేహితుడు శివ సహాయంతో సమీపంలో అటవీ ప్రాంతంలో బతికి ఉండగానే పూడ్చి పెట్టాడు ఆ కసాయి భర్త.

సుప్రజ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అంతా వెదికినా సుప్రజ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు తల్లిదండ్రులు. భర్త వేధించేవాడని, అతనిపై అనుమానం వుందని పోలీసులకు వివరించారు. దీంతో భర్తతో పాటు ఇద్దరిని అరెస్టు చేసి అటవీప్రాంతంలో పూడ్చి పెట్టిన సుప్రజ మృతదేహం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శాడిస్ట్ భర్త పైశాచికంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version