Site icon NTV Telugu

Crime: పిల్లల ముందే భార్యని క్రూరంగా కొట్టి చంపిన కసాయి..

Crime

Crime

Crime: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో హృదయ విదారక సంఘటన జరిగింది. పిల్లల ముందే ఓ కసాయి భర్త తన భార్యను కొట్టి చంపాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. జిల్లాలోని మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింగా గ్రామంలో ఈ దారుణం జరిగినట్లు శనివారం పోలీసులు తెలిపారు.

నిందితుడిని మొహమ్మద్ కలీముల్లా అలియాస్ మున్నాగా గుర్తించారు. కలీముల్లా తన రెండో భార్య మెహ్రుహ్నిషాను కర్రలో దారుణంగా కొట్టాడు. ఆమె ప్రాణాలు కోల్పోయే దాకా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరి పిల్లలు సమీర్, సల్మాన్ సమక్షంలోనే ఆమెపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెహ్రుష్నిషా ఓ వివాహం కోసం అమ్మగారి ఇంటికి వెళ్లింది. అక్కడ నుంచి సొంతింటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.

Read Also: Anchor Ravi : నేను హిందువునే.. నాపై ట్రోలింగ్ ఆపండి ప్లీజ్ : యాంకర్ రవి

గృహ వివాదంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. అతను కోపంతో మెహ్రుహ్నిషాపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలని రక్షించేందుకు గ్రామంలో ఎవరూ రాలేదు. పిల్లలు సాయం కోసం కేకలు వేసినప్పటికీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. మహిళ మరణించిన తర్వాత, కలీముల్లా అక్కడ నుంచి పారిపోయాడు.

కలీముల్లా మొదటి భార్య మరణించింది, మెహ్రుహ్నిషాని రెండో పెళ్లి చేసుకున్నాడు. నిందితుడిని కనిపెట్టడం కోసం పోలీసులు టీమ్‌లను ఏర్పాటు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మైనర్ పిల్లల గుర్తింపును కాపాడటానికి వీడియోని షేర్ చేయవద్దని పోలీసులు ప్రజల్ని కోరారు.

Exit mobile version