Illicit Affair: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్ల పల్లిలో జరిగిన యువకుని హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో అన్న రాజును అతని తమ్ముడు శివ కుమార్ హత్య చేసినట్లు విచారణలో తేలింది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు తమ సమీప బంధువైన ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో తమ కుటుంబ పరువుకు భంగం కలిగిందని శివకుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
Read Also: Tabraiz Shamsi: క్రికెట్ సౌతాఫ్రికాకు షాక్.. కోర్టులో గెలిచిన తబ్రేజ్ షంషి.. అసలు మ్యాటరేంటంటే..?
ఇక, అన్న రాజు చేష్టల కారణంగా తనకు పెళ్లి కావడం లేదని, గ్రామంలో పరువు పోయిందనే కోపంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు శివ కుమార్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, నిందితుడు శివను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.
