NTV Telugu Site icon

Howrah murder: జ్వరానికి క్యాన్సర్ మందులు.. ప్రియుడితో కలిసి భార్య దుర్మార్గం..

Illicit Relation

Illicit Relation

Howrah murder: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. చాలా వరకు కేసుల్లో భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తల్ని హతమారుస్తున్నారు. క్షణకాలం సుఖాల కోసం హత్యలకు పాల్పడటం కాకుండా, పిల్లల్ని ఒంటరివాళ్లను చేస్తు్న్నారు. తాము ఎంతో తెలివిగలవారమని భావించి పక్కా ప్లాన్‌తో హత్యలు చేస్తున్నప్పటికీ, పోలీసుల నుంచి తప్పించుకోలేమనే నిజాన్ని మరిచిపోతున్నారు.

తాజాగా, ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కోల్‌కతా హౌరాలో ఓ మహిళ, తన భర్తను దారుణంగా హత్య చేసింది. భర్తకు వైరల్ ఫీవర్ రావడంతో జ్వరానికి వాడాల్సిన మందులకు బదులుగా ఆమె ఏకంగా క్యాన్సర్ చికిత్సలో వినియోగించే మందులను అందించి అతను మరణించేందుకు కారణమైంది. ఈ హత్యలో ఆమె ప్రియుడు ఫార్మసిస్ట్ హస్తం ఉంది. వీరిద్దర్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

Read Also: Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. మరో 6 నెలల తర్వాతే భూమి పైకి..

నసీమ్ సర్దార్ అనే వస్త్ర వ్యాపారి దాదాపుగా 3 వారాలుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. అతని భార్య సహినా పర్విన్, అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బదులతో ఆమెతో సంబంధం ఉన్న స్థానిక ఫార్మాసిస్ట్ షేక్ మోర్సెలిమ్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. వీరిద్దరు నసీమ్ జ్వరానికి క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చారు. దీంతో నసీమ్ పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతని అవయవాలు విఫలమై మరణించారు.

సాధారణ వైరల్ జ్వరానికి అవయవాలు విఫలం కావడం ఏంటనే అనుమానంతో డాక్టర్లు అనుమానించి, అతడికి ఇచ్చిన మందులు ఏంటని ప్రశ్నించారు. అయితే, అందుకు పర్విన్ అవన్నీ ఆయన వేసుకున్నాడని చెప్పింది. ఆ తర్వాత విచారణలో ఫార్మసిస్ట్ మోర్సెలిమ్ నోటి ద్వారా తీసుకునే కీమోథెరపీ మందుల్ని ఇచ్చినట్లు తేలింది. ఈ హత్యతో ఆగ్రహంలో ఉన్న స్థానికులు సహినపై దాడి చేశారు. మోర్సెలిమ్ ఇల్లు, ఫార్మసీ మరియు మోటార్‌సైకిల్‌ను ధ్వంసం చేసి తగులబెట్టారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, ఆర్ఏఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు.

Show comments