Horrific Incident in Visakha: భారత దేశంలోనే మహిళాలకు సురక్షితమైన నగరాల్లో ఒకటైన విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అయితే, సీతమ్మధారకు చెందిన మూగ బాలికను మద్యం మత్తులో ఉన్న నిందితులు ఇద్దరు ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక, వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆ బాలిక.. జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పి రోదించింది.
ఇక, తక్షణమే ఈ విషయాన్ని 112 ద్వారా కంట్రోల్ రూంకి ఫోన్ చేసి బాధిత మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే, మద్యం మత్తులో నిందితులు అత్యాచారానికి ఒడిగట్టినట్టు గుర్తించిన ద్వారక పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తనని ఏం చేయొద్దని ఎంత బ్రతిమిలాడినా ఆ కీచకులు వదల్లేదని మూగ బాలిక తల్లిదండ్రులకు చెప్పుకొచ్చిన తీరు అందర్నీ కన్నీరు పెట్టిస్తుంది.
