Site icon NTV Telugu

Domestic Violence: మనిషివా..? మృగానివా..? నిన్ను ఏం చేసినా తప్పుకాదేమో!

Crime

Crime

Domestic Violence: క‌ట్టుకున్న భ‌ర్తే కాల‌య‌ముడిలా మారాడు. భార్యను అతి కిరాతంగా చిత్రహింస‌ల‌కు గురిచేశాడు. ఆమెను అత్యంత పాశ‌వికంగా దాడి చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చనీయాంశంలా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడులో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో మహిళపై దాడి చేసిన ఆమె భర్త, అతని ప్రియురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు సంతానం. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచుగా తీవ్రంగా హింసించేవాడు. కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కలుజువ్వలపాడులో ఉంటూ ఓ బేకరీలో పనిచేస్తున్న భాగ్యలక్ష్మి పిల్లలను పోషించుకుంటోంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లే బాలాజీ.. భార్య సంపాదించుకుని దాచి పెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొని వెళ్లేవాడు.

Pakistan: ఛీ.. ఛీ.. ఆటే కాదు.. నిరసన చేయడం కూడా చేతకాదా? ఆసియా కప్ 2025లో హైడ్రామా!

ఈక్రమంలోనే మరోసారి ఇంటికి వచ్చిన బాలాజీ.. భార్యను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో బాలాజీ, తన కుటుంబ సభ్యులు, మరో మహిళతో కలిసి భాగ్యలక్ష్మిని కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. తాళ్లతో ఆమెను బంధించి బెల్టు, కర్రలతో చితకబాదాడు. అంతేకాదు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ విచారణకు ఆదేశించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బ్రహ్మనాయుడు బాధిత మహిళ నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇంటికి వస్తున్న క్రమంలో భర్త బాలాజీ అక్క రమణ, అక్క కొడుకు విష్ణు, భర్త ప్రియురాలు పద్మావతి కలిసి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని సమీపంలోని ఒక ఇంట్లో తాళ్లతో కట్టేసి నిర్బంధించి చిత్రహింసలు పెట్టినట్టు బాధితురాలు భాగ్యలక్ష్మి తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి తెల్లారే వ‌ర‌కు కట్టేసి బెల్టుతో కొడుతూ.. కాళ్లతో తంతూ చిత్రహింసలకు గురిచేశార‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. తిరిగి మరోసారి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసేందుకు రావటంతో తాను గమనించి తప్పించుకున్నట్లు ఆమె వెల్లడించింది.

తగ్గేదేలే.. 77 బంతుల్లోనే శతకం సాధించిన Smriti Mandhana.. రికార్డ్స్ బ్రేక్

ఈ విషయం తెలిసిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలాజీ మేనల్లుడు విష్ణును బైక్‌పై కొంత దూరం తీసుకు వెళ్లారు. కానీ అతన్ని మళ్లీ వదిలేశారు. చివరకు భాగ్యలక్ష్మిని చిత్రహింసలు పెట్టిన వీడియో వైరల్ కావడంతో.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. మరోవైపు బాధితురాలిని చిత్రహింసలు చేసిన వీడియోను బాలాజీ ప్రియురాలు పద్మావతి సెల్ ఫోన్లో తీసింది. ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌టంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. భ‌ర్త కుటుంబ‌ సభ్యులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న భర్త గురునాథం బాలాజీ అతని ప్రియురాలు పద్మావతి కోసం గాలిస్తున్నారు.

Exit mobile version