Homeguard Cheated By His Friends In Hyderabad In The Name Of Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఏదో ఒక విభాగంలో ఉద్యోగం వస్తే చాలని అందరూ కోరుకుంటారు. కొందరైతే లక్షలకు లక్షలు పెట్టి మరీ, ఈ ఉద్యోగాల్ని కొంటుంటారు. దీన్నే అలుసుగా తీసుకొని.. కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. లక్షలకు లక్షలు దోచేసి, ప్రజలకు శఠగోపం పెడుతున్నారు. తాజాగా ఓ హోంగార్డు కూడా ఇద్దరు దుండగుల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఏకంగా రూ.27 లక్షలకు పైగా సొమ్మును కోల్పోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ..
హైదరాబాద్‌లోని న్యూబోయిన్‌పల్లి పోలీస్ క్వార్టర్స్‌లో ఉండే అంతయ్య(37) అనే హోంగార్డు నివాసముంటున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం నకిరేకల్‌కు చెందిన భగ్‌వాన్‌దాస్‌తో పరిచయమైంది. సంవత్సరం తర్వాత, అంటే గతేడాది ఫిబ్రవరిలో.. మిర్యాలగూడకు చెందిన మంగులాల్‌ను తన సహచర విద్యార్థి అంటూ అంతయ్యకు భగ్‌వాన్‌దాస్ పరిచయం చేశాడు. మంగులాల్ రైల్వేలో పనిచేస్తున్నాడని, అతడు ఉద్యోగాలు ఇప్పిస్తాడని చెప్పాడు. అది నమ్మిన అంతయ్య.. తన భార్య గీతకు కమర్షియల్ టాక్స్ అధికారి(సీటీవో), బంధువు కవితకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పించాలని వారిని కోరాడు. తమ బుట్టలో చేప పడిందనుకున్న భగవన్‌దాస్.. అప్పటినుంచి విడతలవారీగా అంతయ్య నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఓవరాల్‌గా అంతయ్య నుంచి వాళ్లిద్దరు రూ.27,50,000 తీసుకున్నారు.
Ravinuthala Govardhan Sharma: సమాచార హక్కు కార్యకర్తల సంఘం జిల్లా కన్వీనర్‌గా గోవర్ధన్ నియామకం
తాను డబ్బులు వేసిన ప్రతీసారి ఉద్యోగాల గురించి అంతయ్య ప్రస్తావిస్తే.. అదిగో, ఇదిగో అంటూ వాళ్లిద్దరు మాట దాటవేస్తూ వచ్చారు. దీంతో.. అంతయ్యకు అనుమానం వచ్చి, తనదైన శైలిలో విచారించాడు. అప్పుడు ఆ ఇద్దరి గుట్టు రివీల్ అయ్యింది. ఉద్యోగాల పేరుతో మంగులాల్ మోసాలకు పాల్పడ్డాడని, ఆరు నెలలక్రితమే అతడ్ని విధుల్లోంచి బహిష్కరించారని తెలిసింది. అలాగే.. తన భార్య, బంధువు కోసం కోరిన సీటీవో, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సైతం ఖాళీగా లేవని తేలింది. దాంతో తాను మోసపోయానని గ్రహించిన అంతయ్య.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
