Site icon NTV Telugu

Physical Harassment: విద్యార్థినులకు హెచ్‌ఎం లైంగిక వేధింపులు.. బ్లూ ఫిల్మ్‌ చూపిస్తూ..!

Physical Harassment

Physical Harassment

Physical Harassment: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ.. ఆలయం వంటి విద్యాలయాన్ని అకృత్యాలకు వేదికగా చేసుకున్నాడో ఘనుడు. అభం శుభం తెలియని విద్యార్థినులపై వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ చూపిస్తూ చిన్నారుల శరీరంపై చేతులు వేసి నొక్కుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు.. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరులో వెలుగు చూసింది.. విద్యార్థులకు విద్యా బుద్దిలు నేర్పే గురువే.. కామంతో తన స్థానాన్ని మరచి సభ్య సమాజం తల దించుకొనే విధంగా ప్రవర్తిన్నాడు. ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల హెడ్ మాస్టర్ సుప్రసాద్ అభం, శుభం తెలియని విద్యార్థినులపై వికృత చేష్టలు చేస్తూ గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

Read Also: Hyderabad: బైక్ పై అబ్బాయి ఒడిలోనే అమ్మాయి.. హద్దులు దాటి ముద్దులు..

స్కూల్‌లోని చిన్నారులకు తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ చూపిస్తూ.. వారి శరీరంపై చేతులతో ఎక్కడ పడితే అక్కడ నొక్కతూ వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు విద్యార్థినులు వాష్ రూంలోకి వెళ్లినా హెడ్‌ మాస్టర్ కూడా వాష్‌ రూమ్‌లోకి వచ్చి అక్కడే నిలిచునేవాడని విద్యార్థులు చెబుతున్నారు. నిత్యం భయ భ్రంతులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు రోధిస్తున్నారు. విద్యార్థినుల బాత్ రూంకు డోర్ తొలగించి సెల్ ఫోన్ లో చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. పెద్దకడుబూరులోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆగడాలకు అంతు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చి పోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ హెడ్ మాస్టర్ సైకో గా మారి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్నారన్న విమర్శలున్నాయి.

Read Also: 200 Year Old Message: గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం!

అయితే, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పితే మీకు TC ఇచ్చి బయటకు పంపిస్తానని బెదిరించాడని విద్యార్థినులు చెబుతున్నారు. ఎవరికి చెప్పాలో తెలియక విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుండి ఐదో తరగతి వరకు సుమారు 140 మంది విద్యార్థులు వున్నారు. హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు తాళలేక TC లు తీసుకొని ప్రైవేటు స్కూల్ లో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థి తల్లిదండ్రులు గొడవ పడి TC తీసుకొని వెళ్లారు. విద్యార్థులు తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారని పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాకు తన బాగోతం భయటకు పొక్కిందని తెలిసి ప్రధానోపాధ్యాయులు 10 రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టినట్లు సమాచారం.

Exit mobile version