Shamshabad Crime: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో.. కారు అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో కారు వెనకాల సీట్ లో మృతుడి తల తెగిపడటంతో భయాందోళన వాతావరణ నెలకుంది. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ ఉట్ పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు.
Read also: Nandamuri : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే..
శంషాబాద్ ఓటర్ రింగ్ రోడ్డు వద్ద అంజయ్య అనే వృద్ధుడు రోడ్డు పై వెళుతున్నాడు. మితిమీరిన వేగంతో కారు ఒక్కసారిగా అంజయ్యను ఢీ కొట్టింది. దీంతో అంజయ్య అద్దంలో ఇరుక్కుపోయాడు. కారు ఓవర్ స్పీడ్ ఉండటంతో ఆపకుండానే కారులో వున్న వ్యక్తి అలాగే నడిపాడు. దీంతో అంజయ్య మొడ తెగి కారు వెనకాల సీట్ లో పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అంజయ్య మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024పై నీలినీడలు.. షార్ట్‌లిస్ట్‌లో భారత్!