Fraud : లక్ష్మీదేవి పూజలతో డబ్బులు డబుల్.. తండ్రీకొడుకులకు రూ. 50 లక్షల బురిడీ..!
- లక్ష్మీ పూజల పేరుతో భారీ మోసం
- తండ్రీకొడుకుల నుంచి రూ.50 లక్షల గల్లంతు
- ఉనికిచెర్ల శివారులో ముఠా మాయ
- మూఢనమ్మకాలపై పోలీసుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అత్యాశను ఎరగా వేసి అమాయకులను దోచుకునే కేటుగాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 50 లక్షలు కాజేసిన ఒక ముఠా ఉదంతం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక కిలాడీ ముఠా మాయమాటలు నమ్మి, తండ్రీకొడుకులు తమ వద్ద ఉన్న భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నారు.
అసలేం జరిగింది? హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులకు పరిచయమైన మహారాష్ట్ర ముఠా, తమకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయని నమ్మించింది. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే, దగ్గర ఉన్న నగదు రెట్టింపు (డబుల్) అవుతుందని నమ్మబలికారు. ఈ మాయమాటలకు ఆకర్షితులైన తండ్రీకొడుకులు, తమ వద్ద ఉన్న రూ. 50 లక్షలను రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ముఠాను సంప్రదించారు.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
మాయం చేసిన ముఠా: పథకం ప్రకారం బాధితులను ఉనికిచెర్ల శివారు ప్రాంతానికి పిలిపించుకున్న కేటుగాళ్లు, పూజల పేరుతో హడావుడి చేశారు. బాధితులు తమ వెంట తెచ్చుకున్న రూ. 50 లక్షల నగదు ఉన్న బ్యాగును ఆ ముఠా చేతికి ఇచ్చారు. పూజ ప్రక్రియలో భాగంగా బాధితుల దృష్టి మళ్లించిన ముఠా సభ్యులు, క్షణాల్లో ఆ నగదు బ్యాగుతో అక్కడి నుంచి మాయమయ్యారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో, తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల హెచ్చరిక: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు, బంగారం రెట్టింపు చేస్తామంటూ వచ్చే అపరిచితులను నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మూఢనమ్మకాలతో కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.
Jagtial: మరో బస్సు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టవేరా.. పలువురికి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్‌లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్‌లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!