Assam: గౌహతిలో దారుణం జరిగింది. మూగ మహిళ, ఆమె కుమార్తెపై దారుణంగా 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రవేటు భాగాలపై కారం చల్లి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన మే 17న జరిగింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన 22 ఏళ్ల కుమార్తెతో గౌహతిలోని సత్‌గావ్ తల్తాలాలో నివాసం ఉంటోంది. అయితే 55 ఏళ్ల అరుణ్ ప్రధాన్ అనే వ్యక్తి సదరు మహిళలో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ నేపథ్యంలో అరుణ్ ప్రధాన్ కొడుకు అమిత్ ప్రధాన్, మరో ఏడుగురు నిందితులు మే 17న బాధితుల ఇంటిలోకి ప్రవేశించి తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితులు ప్రవేట్ భాగాలపై కారం చల్లారు. తీవ్ర చిత్రహింసల వల్ల తల్లీకూతుళ్లు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇరుగుపొరుగు వారు సత్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) కు తరలించారు. అత్యవసర వైద్యసేవలు అందించి ఆసుపత్రి అధికారులు ఇద్దరి ప్రాణాలను కాపాడారు.
Read Also: Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాబోయే మూడ్రోజుల భారీ వర్షాలు
మరోవైపు పోలీసులు కూడా ఈ విషయాన్ని కప్పిపుచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా బాధితులను బెదిరించి మీడియాకు సమాచారం ఇవ్వదన్ని ఆదేశించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సత్‌గావ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 456, 294, 354 మరియు 354 (B) కింద అభియోగాలతో కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తన కొడుకును, నిందితులను కేసు నుంచి బయటకు తీసుకురావడానికి అరుణ్ ప్రధాన్ మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహమైన వెంటనే నిందితుడిపై అభియోగాలు ఎత్తేయాలని సత్‌గావ్ పోలీస్ స్టేషన్ లో కోరాడు. అయితే గ్యాంగ్ రేప్ కేసు కావడంతో పోలీసులు ఈ లేఖను పట్టించుకోలేదు. వైద్యుల నివేదికలో రేప్ అని తేలడంతో ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు.
