Site icon NTV Telugu

Serial killer: ఓరి దేవుడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సీరియల్ కిల్లర్.. 35 ట్రైన్లలో అత్యాచారాలు

Killer

Killer

Serial killer: ఓ సైకో ట్రైన్స్ లో ప్రయాణిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. ఇతడు తెలివిగా రైళ్లలోని లాస్ట్ భోగీలో ఉండే వికలాంగ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కి ప్రయాణికులపై అత్యాచారం, హత్యలు, దోపిడి చేయడానికి అలవాటు పడ్డాడు. కేవలం 35 రోజుల్లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో తిరుగుతూ.. ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. గుజరాత్‌లోని వల్సాద్‌ పోలీసులు సోమవారం (నవంబర్‌ 26) ఎట్టకేలకు ఈ సీరియస్ కిల్లర్ ను పట్టుకున్నారు. వల్సాద్‌ ఎస్పీ డాక్టర్‌ కరణ్‌రాజ్‌ సింగ్‌ వాఘేలాను నిందితుడి యొక్క వివరాలను తెలిపాడు.

Read Also: Nayanthara Case: నయనతారపై సివిల్‌ కేసు నమోదు!

ఈ సీరియల్ కిల్లర్ పేరు భోలో కరమ్‌వీర్‌ జాట్‌.. హర్యానాకు చెందిన వ్యక్తి.. గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇటీవల రైల్వేలో సీరియల్‌ కిల్లర్‌గా మారిపోయాడు. పోలీసుల విచారణలో ఇతగాడి నేరాల చిట్టా మొత్తం బయటకు వచ్చింది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని ఓ రైలులోని వికలాంగుల పెట్టెలో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో సికింద్రాబాద్‌ జీఆర్పీ అధికారులకు వల్సాద్‌ పోలీసులు సమాచారం అందజేయగా.. ఈ హత్య తానే చేసినట్లు కరమ్‌వీర్‌ ఒప్పుకున్నాడు. దీంతో నగర పోలీసులు పీటీ వారెంట్‌పై కరమ్‌వీర్‌ను హైదరాబాద్‌కి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version