Site icon NTV Telugu

UP: శోభనం గదిలో వరుడి ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Crime

Crime

పెళ్ళై కాలికి పారాణి కూడా ఆరక ముందే ఓ నవ వరుడు ఆత్మహత్యకుల పాల్పడ్డాడు. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. శోభనం గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఇటావా పోలీస్ స్టేషన్‌లోని ఉష్రాహర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత సైనికుడు గన్‌సింగ్‌ చిన్న కుమారుడు సత్యేంద్ర వివాహం జరిగింది. వివాహానికి ముందే అంటే జులై 2న గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. రాత్రంతా ఘనంగా బ్యాండ్ బాజా నిర్వహించారు. ఆ తర్వాత ఆచార వ్యవహారాల ప్రకారం జులై 3వ తేదీన వధువు స్వగ్రామంలో వివాహం జరగింది. తర్వాత పెళ్లి కూతురు ఊళ్లో కూడా ఘనంగా ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపు అనంతరం భర్త సత్యేంద్ర ఇంటికి అతని భార్య వచ్చింది. అప్పటి వరకు వరుడు సత్యేంద్ర స్నేహితులతో కలిసి డ్యాన్స్ లు వేస్తూ పెళ్లి వేడుకలో ఉత్సాహంగా ఉన్నాడు.

READ MORE: Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్ జీ బైక్ ను విడుదల చేసిన బజాజ్.. ధర ఎంతంటే?

కానీ.. పెళ్లి రోజు పెళ్లి కూతురు పాల గ్లాస్ తో బెడ్ రూమ్ దగ్గరకు వెళ్లింది. అంతే అక్కడ సీన్ చూసిన పెళ్లికూతురు బిత్తరపోయింది. కుటుంబ సభ్యులు శోభనం గదిలోకి వెళ్లి చూడగా సత్యేంద్ర ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆ నూతన వధువు ఒక్కసారిగా బిత్తరపోయింది. నవ వరుడు ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో విషాధం నెలకొంది. కాళ్ల పారాణి కూడా ఆరక ముందే ఆ వివాహిత వితంతువుగా మారడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. బలవన్మరణానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు.

Exit mobile version