Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- హృదయ విదారక ఘటన
- పెళ్లి తంతు జరుగుతుండగానే వరుడు అకస్మాత్తుగా అస్వస్థతకు
- చికిత్స పొందుతూ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి ఇంట్లో డప్పులు, మేళతాళాలు, బంధుమిత్రుల సందడితో కళకళలాడాల్సిన వేడుక ఒక్కసారిగా విషాదంగా మారింది. పెళ్లి తంతు జరుగుతుండగానే వరుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పెళ్లి మండపం ఆనందానికి బదులుగా విషాదంతో నిండిపోయింది. ఈ హృదయ విదారక ఘటన బీహార్ రాష్ట్రంలోని మోతిహారి జిల్లాలోని రామ్గఢ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిక్నీ గ్రామంలో చోటుచేసుకుంది.
పెళ్లి వేడుకలోనే అస్వస్థత
సమాచారం ప్రకారం, మఝౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వాలియా గ్రామానికి చెందిన 25 ఏళ్ల శక్తినాథ్ శర్మ వివాహ ఊరేగింపు ఘనంగా చిక్నీ గ్రామానికి చేరుకుంది. వధువు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికి అతిథులకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం వివాహ తంతు ప్రారంభమైంది. వధూవరులు మండపంలో కూర్చున్న సమయంలో వరుడికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు అతడిని మెరుగైన చికిత్స కోసం రక్సౌల్‌లోని ఎస్ఆర్పీఎస్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సరికి వరుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వరుడి మృతివార్త తెలియగానే ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి సంబరాలు ఒక్కసారిగా శోకసంద్రంగా మారాయి.
కన్నీరుమున్నీరైన వధువు
వధువు రఘుని కుమారి వివాహం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, పెళ్లి మండపంలోనే వరుడు మృతి చెందడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. కాళ్ల పారాణఇ ఆరకముందే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
కుటుంబంలో చిన్నవాడే వరుడు
మృతుడు శక్తినాథ్ శర్మ ముగ్గురు సోదరుల్లో చిన్నవాడు. అతని తల్లిదండ్రులు ఇప్పటికే మరణించగా, అన్నయ్య సంరక్షకుడిగా వ్యవహరిస్తూ ఎంతో ఆశతో ఈ వివాహాన్ని ఏర్పాటు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో భర్వాలియా గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వేళ ఇలా విషాదం చోటుచేసుకోవడంతో స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!