Groom killed: పెళ్లికి ఒక రోజు ముందు వరుడి దారుణహత్య.. వధువు “లవ్ ఎఫైర్” కారణం..
- ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం..
- పెళ్లికి ఒక రోజు ముందు వరుడి దారుణహత్య..
- వధువు లవ్ ఎఫైర్ కారణంగానే మర్డర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Groom killed: పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భర్తల్ని చంపడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. పలువురు మహిళలు తమ భర్తల్ని చంపుతున్న కేసులు ఇటీవల కాలంలో పెరిగింది. ఇటీవల మేఘాలయలో రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో భార్య సోమన్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్‌లో ఒక వరుడిని పెళ్లి ముందు రోజు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జూన్ 15న జరిగింది. వరుడి గ్రామం ధన్పూరాకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితుడికి, మృతుడికి కాబోయే భార్యతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Read Also: Asim Munir: ‘‘నువ్వు ఒక పిరికిపంద, నీకు సిగ్గులేదు’’.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ఘోర అవమానం..
రాంపూర్ పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు సద్దాంను సోమవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హత్యకు గురైన నిహాల్ మొబైల్ ఫోన్‌ని దాడిపెట్టినట్లు నిందితుడు పోలీసులకు చెప్పారు. నిహాల్ 15వ తేదీన హత్యకు గురయ్యాడు. హత్య తర్వాత, కొత్వాలి గంజ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు నిహాల్ మొబైల్ స్వాధీనం చేసుకునే క్రమంలో, సద్దాం పోలీసుల వద్ద నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు సద్దాం గాయపడ్డాడు.
వధువు గుల్ఫాషాగా గుర్తించారు. ఈమె, తన లవర్ సద్దాంతో కలిసి నిహాల్ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు నిందితుడి స్నేహితుడు కూడా సాయం చేశాడు. ప్రస్తుతం, గుల్ఫాషా, మరో నిందితుడు పరారీలో ఉన్నారు. బాధితుడు నిహాల్ (35) వివాహాలు, పార్టీలకు వంటవాడిగా పనిచేస్తున్నాడు.
భోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనుపుర గ్రామానికి చెందిన గుల్ఫాషాతో అతని వివాహం నాలుగు నెలల క్రితం నిశ్చయించబడింది. జూన్ 15న వివాహం జరగాల్సి ఉంది, నిహాల్ ఇంట్లో సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ 14న వధువు బంధువుగా పరిచయం చేసుకున్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు కుటుంబీకులు చెప్పారు. దీంతో నిహాల్ ఇద్దరితో కలిసి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు సద్దాం, అతడి అనుచరుడు ఫర్మాన్, అనీస్‌పై కేసు నమోదు చేశారు. గుల్ఫాషా 32 ఏళ్ల పొరుగువాడు సద్దాంతో ఒక సంవత్సరం పాటు ప్రేమలో ఉందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!