రకరకాల యాప్ లు వస్తున్నాయి.. అందులో కొన్ని యాప్ జనాలకు నచ్చుతున్నాయి. మరికొన్ని యాప్స్ జనాలను దారుణంగా మోసం చేస్తున్నాయి.. తాజాగా ఫోన్ బ్యాటరీని పీల్చే 43 హానికర యాప్స్..ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.. ప్రపంచంలోని అతిపెద్ద యాప్స్ పంపిణీ ప్లాట్‌ఫామ్స్‌ల్లో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఒకటి. దాదాపు 30 లక్షల యాప్స్, గేమ్స్ కలిగి ఉంటుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాపులారిటీ సంపాదించుకున్న గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకున్నది. మొబైల్స్ ను పాడు హానికర యాప్స్, లేదా తన పాలసీలను ఉల్లంఘించే యాప్స్‌ను తొలగించడంలో ముందు నిలుస్తుంది.
ప్రజలకు హానీ కలిగిస్తున్న తాజాగా 43 యాప్స్‌ను తన ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ తెలిపింది. యూజర్లు తమ ఫోన్లలో ఉన్న ఆయా యాప్స్‌ను డిలిట్ చేయాలని సూచించింది. ఆ యాప్స్ ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను తినేయడంతోపాటు యూజర్ల డేటాను తస్కరిస్తున్నాయి. యూజర్ల స్మార్ట్ ఫోన్లు టర్న్ ఆఫ్ అయినప్పుడు ఆ యాప్‌లు యాడ్స్ లోడ్ చేస్తున్నాయి. ఇది గూగుల్ ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధం. ఇలా ఇప్పుడు 25 లక్షల రెట్లు ఈ యాప్స్ డౌన్ లోడ్ అయ్యాయని గూగుల్ ప్లే స్టోర్ పేర్కొంది..
గూగుల్ ప్లే స్టోర్ పాలసీలను ఈ యాప్స్ ఉల్లంఘిస్తున్నాయని మొబైల్ రీసెర్చ్ టీం మైకేఫే పేర్కొంది. ఈ మేరకు గూగుల్‌కు మైకేఫే వెల్లడించింది. వీటిల్లో చాలా యాప్స్ ప్లే స్టోర్ నుంచి తొలగించగా, కొన్నింటిని డెవలపర్స్ అప్ డేట్ చేశారని వివరించింది. ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లు ఆ యాప్స్ డిలిట్ చేయాలని కోరింది.. టీవీ/డీఎంబీ ప్లేయర్స్, మ్యూజిక్ డెవలపర్స్, న్యూస్, యాడ్స్ తరహా 43 యాప్స్ తొలగిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ తెలిపింది. ట్రస్టెడ్ డెవలపర్స్ నుంచి యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలని.. అంతకన్నా ముందు పర్మిషన్స్ ఇచ్చే ముందు అన్ని తెలుసుకొని డౌన్లోడ్ చెయ్యాలని హెచ్చరించింది..